కొత్తగా వస్తున్న దండుపాళ్యం 2

Dandupalyam 2 team is very much confident about July 14th release

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన ‘దండుపాళ్య’ కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా 30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి 10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది.

Dandupalyam 2 team is very much confident about July 14th release

తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన ‘దండుపాళ్యం’ టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ – ”తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని జూలై 14న తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. రియల్‌ ఇన్సిడెంట్స్‌తో ఎంతో నేచురల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. దండుపాళ్యం చిత్రాన్ని మించి ‘దండుపాళ్యం2’ సూపర్‌హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ మాకు వుంది” అన్నారు.

See Also: నిజం ఇప్పుడైనా బయటికొస్తుందా??

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ – ”సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ‘దండుపాళ్యం2’ ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది” అన్నారు.

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

See Also: రవితేజ ఎందుకలా చేశాడు??

Have something to add? Share it in the comments

Your email address will not be published.