కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..!

Delhi Chief Minister Arvind Kejriwal In Government Ads, His Party Gets Bill For 97 Crores

Delhi Chief Minister Arvind Kejriwal In Government Ads, His Party Gets Bill For 97 Crores

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరు వచ్చినా కేజ్రీవాల్‌ను టార్గెట్ చేయడం మాత్రం మానట్లేదు. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఏదో ఒక రూపంలో ఆయనకు ముచ్చెమటలు పట్టించిన లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఇప్పుడు నేరుగా ఎటాక్ చేస్తున్నారు. ఏదో ఒక విషయంలో అరవింద్ కేజ్రీవాల్‌ తప్పులను దొరకబట్టి షాక్‌లు ఇస్తున్నారు.

లేటెస్ట్‌గా కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ గట్టి ఎదురుదెబ్బ తగిలిలేలా షాక్ ఇచ్చారు. సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని కాకుండా కేజ్రీవాల్‌ను, ఆయన పార్టీని ప్రధానంగా చూపిస్తూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అందుకు గాను 97 కోట్ల రూపాయలను ఆ పార్టీ నుంచి వసూలు చేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశించారు.

ప్రకటనల పేరిట 526 కోట్ల రూపాయలను ఆప్‌ ప్రభుత్వం ప్రభుత్వానికి కాకుండా పార్టీ ప్రచారానికి ఉపయోగించిందంటూ గతంలో కాగ్‌ తప్పుబట్టింది. ఈ విషయంలో దుర్వినియోగం చేసిందంటూ గతంలో కాగ్‌ తప్పుబట్టిన నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన లెఫ్టినెంట్ గవర్నర్‌  97 కోట్ల మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.