ఢిల్లీలో గ్యాస్ లీక్… 110మంది విద్యార్థులకు అస్వస్థత

Delhi Gas Leak 110 students hospitalized after Gas leakage in Tuglakabad

Delhi Gas Leak 110 students hospitalized after Gas leakage in Tuglakabad

పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రోజు తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలో తుగ్లకాబాద్‌కు సమీపంలోని పుల్ పెహ్లాద్‌పూర్ ప్రాంతంలో ఉన్న రాణీ ఝాన్సీ స్కూలు సమీపంలో ఓ కంటెయినర్ నుంచి గ్యాస్ లీకైంది. దాంతో వంద మంది విద్యార్థులను స్కూలు నుంచి వెంటనే బయటకు తీసుకొచ్చేశారు.

అయితే గ్యాస్ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం.. సమయానికి అప్రమత్తమై విద్యార్థులను బయటకు తీసుకొచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. వారిలో 50 మంది అస్వస్థత పాలు కావడంతో వారిని వెంటనే సమీపంలో ఉన్న మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు.

గ్యాస్ లీకేజికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటన స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.