కేంద్రం నిర్ణయంపై కమలనాథుల భిన్నాభిప్రాయాలు

Delimitation AP TS BJP units differ on the centre’s decision

Delimitation AP  TS BJP units differ on the centre’s decision

 

పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటంలా తయారైంది రెండు రాష్ట్రాల్లోని కమలనాథుల పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు చూపించిన ఆశలకు ఎగబడి వలసవచ్చిన ప్రజాప్రతినిధుల భవిష్యత్తుకోసం పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేస్తున్నారు సీఎంలు. వలస వచ్చిన ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అవసరైన సీట్ల పెంపు జరుగకపోతే సొంతపార్టీల్లో అసమ్మతి సెగలు పెద్ద ఎత్తున పెల్లుబికే అవకాశాలున్నాయని నిర్ణయానికొచ్చిన ముఖ్యమంత్రులు ఇద్దరూ ఇప్పడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ కమలనాథులు పార్టీ అగ్రనాయత్వం దగ్గర చేస్తున్న లాబీయింగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై సందేహాలు కొనసాగుతున్నాయి.

విభజన చట్టం ప్రకారం తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆమేరకు రెండు రాష్ట్రాల శాసనసభలు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. ఆ ప్రకారంగా 119 సీట్లున్న తెలంగాణలో 153కు, 175 సీట్లున్న ఏపిలో 225కు నియోజకవర్గాలను పెంచాలని రెండు ప్రభుత్వాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఇద్దరు ముఖ్యంత్రులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా కేంద్రంలో లాబీయింగ్ గట్టిగా చేయిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పట్లో ఎలాంటి పెునర్విభజనకు ఆస్కారంలేదని తేల్చిచెప్పినప్పటకీ లోలోపల జరిగే లాబీయింగ్ మాత్రం ఆగట్లేదు.

ప్రస్తుతం జరగుతున్న పరిణామాలతో  రెండు రాష్ట్రాల్లోని కమలనాథులకు చెమటలు పడుతున్నాయి. అటు రెండు రాష్ట్రాల బిజెపి శాఖలు మాత్రం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిన అవసరం లేదని కరాఖండిగా పార్టీ కేంద్ర అధినేతల దగ్గర చెప్పారట. పునర్విభజనపై రెండు రాష్ట్రాల నాయకులతో అమిత్ షా చర్చల తర్వాత రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఇప్పటి పరిస్థితిలో తమకు అవసరం లేదని లిఖితపూర్వకంగా రాసిచ్చారట. తెలంగాణాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం బిజెపికి ఏమాత్రం లాభం చేకూరకపోగా టీఆర్ఎస్, మజ్లిస్‌లు మరింత బలపడుతాయని కమలనాథులు వాపోయారట. మరోవైపు పునర్విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు ఉన్నందువల్ల బిజెపికి లాభం చేకూరే అవకాశాలున్నాయని కమలనాథులు భావిస్తున్నరని సమాచారం. అయితే పునర్విభజన వల్ల పార్టీకి కొత్తగా వచ్చిన లాభమేమీ వుండదని, సంస్థాగతంగా అంత బలం కూడా లేదని కొందరు నాయకులు భావిస్తున్నారట.

Have something to add? Share it in the comments

Your email address will not be published.