కమిట్మెంట్‌కి మెచ్చుకోవాలా లేక…???

Despite Brother Bharath death Hero Ravi teja went for Shooting

కుటుంబ సభ్యుడు ఎవరైనా జబ్బు పడి, రోజుల తరబడి మంచాన ఉండి చనిపోతే బాధ కంటే అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతం. అంతా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాల్లో మునిగితేలుతూ తేరుకోవడానికి కనీసం వారం పడుతుంది. అలాంటిది తమ్ముడు చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు రాలేనని, చివరిచూపు చూసే ధైర్యం లేదని చెప్పుకొచ్చిన హీరో రవితేజ చేసిన పనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.

Despite Brother Bharath death Hero Ravi teja went for Shooting

ఔటర్ రింగ్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన సినీ నటుడు భరత్‌ అంత్యక్రియలకు వెళ్ళని హీరో రవితేజ ఆ తర్వాత రోజే షూటింగ్‌లో పాల్గొనడంపై దుమారం రేగుతోంది. మనిషి జీవితమంతా ఎలా ఉన్నామన్నది కాకుండా చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారన్నదే ముఖ్యమని అందరూ చెబుతున్నప్పటికీ అందరూ ఉండి కూడా అనాథలా భరత్‌ అంత్యక్రియలు జరిగాయని చనిపోయినవారి విషయంలో మంచిచెడులు ఉండవని రవితేజ తమ్ముణ్ని కడసారైనా చూస్తే బాగుండేదని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన షెడ్యూల్‌ను నమ్ముకొని పనిచేసే వందలమంది కార్మికుల పొట్టకొట్టడం ఎందుకని షూటింగ్‌కు వెళ్ళారా లేక తమ్ముడిపై అసలు ప్రేమలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

See Also: రవితేజ ఎందుకలా చేశాడు??

భరత్‌ అంత్యక్రియలు పూర్తయి 24 గంటలైనా కాకముందే హీరో రవితేజ ప్రస్తుతం చేస్తున్న ‘రాజా ది గ్రేట్‌’ షూటింగ్‌లో పాల్గొన్నారన్న వార్త దావానంలా వ్యాపించింది. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. తమ్ముడు భరత్‌ చనిపోయిన పరిస్థితుల్లో షూటింగ్‌ వాయిదా వేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించినప్పటికీ హీరో రాకపోతే తనవల్ల చాలామంది ఇబ్బందిపడే అవకాశం ఉన్నందునే, తాను వస్తానని హీరో రవితేజ చెప్పడంతో యధావిధిగా షూటింగ్ జరిగిందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇంత బాధలోనూ షూటింగ్‌కు వచ్చిన హీరో కమిట్మెంట్‌ను మెచ్చుకోవాలా లేక తమ్ముడి అంతిమసంస్కారానికి కూడా హాజరుకాని అతన్ని సంస్కారాన్ని నిందించాలా అన్న చర్చ జరుగుతోంది..

See Also: ప్రాణం తీసిన అతివేగం – మద్యం

Have something to add? Share it in the comments

Your email address will not be published. • జైదేవ్ says:

  మనలో ఎవ్వరు దాచుకొన్నా-సమర్ధించుకొంటున్నా -భరత్ వంటి సోదరులు ఉన్న కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయ్(మాది కూడా).
  అంత మాత్రాన ఒకకే తండ్రి రక్తం పుచ్చుకొని -ఒకే తల్లి పాలు పంచుకొన్న” ఒక మనిషి” మాంసం ముద్దలా పడుంటే,సర్వ సమాజం తలదించుకొనేలా
  ప్రవర్తించిన “రవి తేజ కుటుంబ సభ్యులు యావన్మంది “దోషులే.
  ఈ మధ్య FB పుణ్యమా అని “అనాధ శవాలను కన్నీటితో అంతిమ సంస్కరణలు చేసే మహానీయులు”కన్పిస్తుంటే మాలోని మానవత్వం కన్నీటి పారితోషికం వారికి సమర్పిస్తుందన్నది పచ్చి నిజం.
  ఒక్క కాకి కరెంటు షాక్ తగిలి చనిపోతే –
  సాటి కాకుల అరుపులు రవితేజ వినలేదా?
  పేగు కోత ఆ తల్లికి లేదా? ఆ తండ్రి ఇంత కసాయా?
  పైగా కహనీలు-కహనీలకు కవరింగ్ అభిమానుల కామెంట్లు…(రవి తేజ అభిమానులకు బువ్వెట్టి పంపాడంటా!)
  ఛీ,,,ఏంటో ప్లాస్టిక్ బియ్యం -ప్లాస్టిక్ గాడిద గుడ్లొచ్చాయంటు రూమర్స్ ,,,,
  కళ్ళెట్టుకు చూద్దాం ఇదిగో ….ప్లాస్టిక్ మనుషులు
  – ప్రేమలు-మనస్సులు.
  సారీ భరత్! నువ్వెలా బతికావో -చనిపోయావో మాకు తెలీదు …కానీ నీ దురధృష్టం ఏంటంటే?
  నిన్ను మోసింది కిరాయి మనుషులు –
  తగలెట్టింది కూడా కిరాయి (కరెంటు) మంటలే.
  అభిమానుల్లారా! నన్ను తిట్టుకొనే కన్నా -షూటింగ్ మొదలైందంటా,,,పోయి ఈలలేయండి.