గజ్వేల్ అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలి: కేసీఆర్

హైదరాబాద్: “గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని“ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై జనహితలో సోమవారం ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది కార్యక్రమాలను మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని, అవి సక్రమంగా అమలు జరిగే విధంగా మంత్రులు, అధికారులు బాధ్యత స్వీకరించాలని ఆయన కోరారు.

“విషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నియోజవర్గానికి త్రాగునీరుని అందిస్తున్నాం, అవి ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని“ ముఖ్యమంత్రి తెలిపారు. దాని సంబంధించి ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా మంత్రులు, అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అదే విధంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ఎమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని, నియోజవర్గంలో పవర్ డే నిర్వహించి వంగిన కరెంటు స్తంబాలు, వేలాడే వైర్లను సరిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వరంగల్ రూరల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో ప్రజలు 25 కమిటీలు వేసుకుని వారి గ్రామాన్ని వారే అభివృద్ది చేసుకుంటున్నారు. నాయకులు, అధికారులు, ఆ గ్రామాన్ని పర్యటించి వారు ఎలా అభివృద్ధి చేసుకున్నరో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు‎.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ వెంక్రటామి రెడ్డి, జాయింట్ కలెక్టర్ హన్మంతరావు, సిఎంఓ అధికారులు శాంతకుమారి, భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, నియోజవర్గానికి చెందిన పలువురు ఎంపిపీలు, సర్పంచ్లు, జడ్పిటీసిలు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.