నెహ్రూ‌తో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నవర్మ

Devineni Nehru A symbol of strength with strong convictions says RGV1

Devineni Nehru A symbol of strength with strong convictions says RGV

విద్యార్థి సంఘం నాయకుడిగా మొదలై రాజకీయ ప్రయాణంలో టిడిపిలో చేరి ఆతర్వాత కాంగ్రెస్‌లోకి మారి ఈ మధ్యే మళ్ళీ టీడీపీలోకి చేరిన బెజవాడ నాయకుడు దేవినేని నెహ్రూ. విజయవాడలో రౌడీ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటూ ప్రత్యర్థులను తన ప్రణాళికలతో దెబ్బతీస్తూ నాయకుడిగా ఎదిగిన నెహ్రూ గుండెపోటుతో మ‌ృతిచెందారు.

విజయవాడ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ నుండి ఈమధ్యే సొంతగూటికి చేరుకున్నారు. వంగవీటి మోహన్‌రంగా హత్య సమయంలో మారిన రాజకీయాల్లో నెహ్రూ విద్యార్థి నాయకుడినుండి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారు. ఈమధ్యే వంగవీటి మోహన్‌రంగా హత్యకు సంభంధించి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన వంగవీటి సనిమాకు ఇన్‌పుట్స్ తీసుకొనే సమయంలోనూ వర్మ నెహ్రూతో చాలాసార్లు కలసి విషయాలు తెలుసుకున్నారు.

Devineni Nehru A symbol of strength with strong convictions says RGV1

ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతిచెందిన దేవినేని నెహ్రూకు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు. నెహ్రూ చనిపోయారని తెలిసి తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. బలానికి మారుపేరైన నెహ్రూతో తనకు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయని ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు వర్మ. బీఏ వరకు చదివిన నెహ్రూకి లక్ష్మితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌ తండ్రికి రాజకీయ వారసుడిగా వ్యవహరిస్తున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.