టీడీపీ నేత దేవినేని నెహ్రూ కన్నుమూత

హైదరాబాద్: మాజీ మంత్రి, టిడిపి నేత, దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యకారణాలవల్ల కేర్ హాస్పిటల్ చేరిన ఆయన రెండు రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఉదయం 4 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను బంజరాహిల్స్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

దేవినేని నెహ్రూ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి, కంకిపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయవాడ రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.