అవసరమా ఈ దొంగ ఉద్యమాలు??

Dharna Chowk Politics become more uglier as police took part in Mufti to counter All Party

Dharna Chowk Politics become more uglier as police took part in Mufti to counter All Party

ఇన్నేళ్ళలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో అనేక నిరసన కార్యక్రమాలు, సభలు, ధర్నాలు చూశాం కానీ ఈరోజు జరిగిన ప్రాయోజిత ధర్నాలాంటి ధర్నాను మాత్రం ఎవరూ చూసి ఉండరు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు ధర్నా చౌక్ సాక్షిగా ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు సైతం తమ ఉద్యమ స్ఫూర్థిని ప్రదర్శించారు. అదే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేసుకుంటామనే వాళ్ళకి అనుమతులు ఇవ్వకుండా అసలు ఇందరిపార్క్ సమీపంలో ధర్నా చౌకే లేకుండా చేయడానికి రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాచౌక్ ఉండడం వల్ల స్థానికుల నుండి అభ్యంతరాలు పెద్ద ఎత్తున వస్తున్నాయని ఒక కారణాన్ని చూపించి ధర్నాచౌక్‌ను ఎత్తేసే ప్లాన్‌ చేసింది ప్రభుత్వం. ఈరోజు ధర్నా చౌక్ దగ్గర అఖిలపక్ష ఉద్యమానికి కౌంటర్‌గా స్థానికులతో సేవ్ ఇందిరాపార్క్ అనే ఉద్యమానికి తెరలేపి బొక్కబోర్లా పడింది.

అసలు వాకర్స్ అనే ఓ ఫేక్ ఐడెంటిటీని తయారుచేసి వాళ్ళతో కౌంటర్ ఎటాక్ చేయిస్తే అంతా సెట్ అయిపోతుందని ప్రభుత్వానికి ప్లాన్ ఇచ్చిన నాయకులు, మేధావులు ఎవరో కానీ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టను, పార్టీ పరువును జనాల ముందు దోషిగా నిలబెట్టి పరువుతీశారు. అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఇప్పటికే ఎన్నో కీలక పరిణామాల్లో తనదైన స్టైల్లో పావులు కదిపి గెలిచిన వ్యక్తి. అలాంటి కేసీఆర్ పరువు తీసేలా ఆయన శిష్యులు ధర్నాచౌక్ విషయంలో చేసిన నానా యాగీ ప్రజల ముందు టీఆర్ఎస్ ఇమేజ్‌ను దెబ్బతీయడం ఖాయం. ఎందుకంటే వాకర్స్ అసోసియేషన్ అని, స్థానికులు అని ఈరోజు సేవ్ ఇందిరాపార్క్ అంటూ నినాదాలు చేసిన ఒక్కరు కూడా స్థానికులు లేకుండా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు మఫ్టీ పోలీసులు కొందరు ప్లకార్డులు పట్టుకొని మీడియా ముందు మాట్లాడడం చూసి అందరూ విస్తుపోయారు. కొంతమందిని మీడియా గుర్తుపట్టడంతో కాళ్ళకు పనిచెప్పిన సోకాల్డ్  స్థానికులు తమ ఉద్యమాన్ని గాలికి వదిలేసారు.

అసలు ఇందరాపార్క్ దగ్గర ధర్నాచౌక్ ఎందుకు వద్దనుకుంటుందో చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా ఫేక్ ఉద్యమాలు చేయించి పరువుతీసుకోవడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.