కొత్తరకమైన స్క్రీన్‌ప్లేతో మార్చి17న వస్తున్న ‘మా అబ్బాయి’

‘ప్రేమ ఇష్క్ కాద‌ల్‌’, ‘ప్ర‌తినిధి’, ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సినిమా ”మా అబ్బాయి’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు  నిర్మించిన ఈ సినిమా మార్చి 17న విడుదలకు సన్నద్ధమైంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మీడియతో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే…

`మా అబ్బాయి` సినిమా నా కెరీర్‌లో ఎక్కువ బ‌డ్జెట్‌తో రూపొంది స్పాన్ ఎక్కువ‌గా ఉన్న సినిమా. బ‌డ్జెట్ ఎక్కువ అన‌గానే నాకు మార్కెట్ లేదు క‌దా..నాపై భారీ బ‌డ్జెట్ సినిమా ఎందుక‌ని ఆలోచించాను. అయితే నిర్మాత‌గారు క‌థ‌పై చాలా న‌మ్మ‌కంగా ఉండి సినిమా చేద్దామ‌ని అన‌డంతో టీంగా అందరం ధైర్యంగా ముందుకెళ్ళాం. అయితే ఈ సినిమా కథ చాలా కొత్తగా భిన్నంగా ఉంటుందని నేను చెప్పను. ఇది పక్కా కమర్షియల్ సినిమానే. అయితే కమర్షియల్ సినిమాల్లో ఇప్పటివరకు రాని కొత్తరకమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన సినిమా అని గ‌ట్టిగా నమ్ముతున్నాను . అదే విషయం మీ అందరికీ ధైర్యంగా చెప్పగ‌ల‌ను.’

‘మా అబ్బాయి అనే మాట‌ను మ‌నం త‌రుచుగా వింటుంటాం. మ‌నం త‌రుచుగా వాడుతుంటాం. అలాంటి కామ‌న్ అబ్బాయి క‌థే `మా అబ్బాయి` సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే కుర్రాడ‌న్న‌మాట‌. సిస్ట‌ర్‌, బ్ర‌ద‌ర్ మ‌ధ్య అనుబంధం చాలా గొప్న్నిపగా తెరకెక్కించారు. ఇందులో కాన్ఫిడెంట్‌గా ఉండే కుర్రాడిగా క‌న‌ప‌డ‌తాను. ఓపెన్‌గా ఉండే పాత్ర‌. యాక్ష‌న్ పార్ట్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. కానీ యాక్ష‌న్ అంతా క‌థ‌లో భాగంగానే ఉంటుంది. త‌న ఫ్యామిలీకి ఓ స‌మ‌స్య‌ను హీరో ఎలా ప‌రిష్క‌రించుకున్నాడ‌నేదే క‌థ‌. చిన్న సోష‌ల్ మెసేజ్‌తో, రెండు మూడేళ్ళ క్రితం హైద‌రారాబాద్‌లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న ఆధారంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నాకు తండ్రి క్యారెక్టర్‌ను కాశీ విశ్వనాథ్‌గారు చేయగా తల్లి క్యారెక్టర్‌ను సన గారు చేశారు.’

‘ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి నాకు సోలో సినిమా నుండి ప‌రిచ‌యం. సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఇక సినిమా చూస్తే త‌న డైరక్ష‌న్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే నిర్మాత బ‌ల‌గ ప్ర‌కాష్‌గారు సినిమాను క్వాలిటీ విషయంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. మార్చి 17న రిలీజ్ అవుతున్న మా అబ్బాయి తర్వాత మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అలాగే పెద్ద బ్యాన‌ర్స్‌లో కూడా సినిమాలున్నాయి. ‘

శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః థ‌మ‌శ్యామ్,సంగీతంః సురేష్ బొబ్బిలి, పాట‌లుః కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి,  ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు,క‌థ‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వంః కుమార్ వ‌ట్టి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.