పంచ్‌లు వేసే పూరీకే సిట్ పంచ్‌లు

Director Puri Jagannadh reveals some secrets about Kelvin and Drugs

తన సినిమాల్లో పంచ్ డైలాగులతో అందరినీ ఉక్కిరబిక్కిరి చేసే దర్శకుడు పూరీ జగన్నాధ్‌ను డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన నేపథ్యంలో సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మీడియా, పోలీసులపై పంచ్‌లు వేసే పూరీకే విచారణలో పంచ్‌లు పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. తొలిదశలో సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో భోజన విరామ సమయానికి దాదాపు 20 ప్రశ్నలను అధికారులు సంధించినట్టు సమాచారం.

Director Puri Jagannadh reveals some secrets about Kelvin and Drugs

ఎన్ని రోజులకోసారి డ్రగ్స్ తీసుకొంటారు?? డ్రగ్స్ వాడకం ఎప్పుడెప్పుడు ఉంటుంది?? ఎన్ని రోజులకోసారి తీసుకొంటారు?? డ్రగ్స్ ఎలా రవాణా చేస్తారు?? ఎక్కడ భద్రపరుస్తారు?? కెల్విన్ ఎలా వాటిని సరఫరా చేస్తాడు?? అనే కోణంలో సినీ ప్రముఖులను వివిధ రకాలు ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా పూరీ జగన్నాధ్‌ని కూడా ఇలాంటి ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగి సమాధానలు రాబడుతున్నారు. అయితే సిట్ సంధిస్తున్న ప్రశ్నలతో ఓ దశలో పూరీ అసహనానికి, తీవ్ర ఒత్తిడికి గురైనట్టు సమాచారం.

పూరీ జగన్నాథ్ విచారణ కోసం దాదాపు భారీగానే ప్రశ్నల్ని రూపొందించారని తెలుస్తోంది. కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానం రాబట్టేంతవరకు పూరీ జగన్నాధ్‌ని వదిలిపెట్టలేదనేది ఇన్‌సైడ్ టాక్. అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు పూరీ బాడీ లాంగ్వేజ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేగాక పూరీ జగన్నాథ్‌ను ప్రధానంగా బ్యాంకాక్ పర్యటనల గురించి ఆరా తీసినట్టు తెలుస్తున్నది. కథలు వినడానికా? కథలు తయారు చేసుకోవడానికి బ్యాంకాక్ వెళ్తారా లేక డ్రగ్స్ కోసమే అక్కడి వెళ్తారా అనే ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం.

See Also: నా కొడుకు బంగారం

అంతేగాక ఈ డ్రగ్స్ కేసులో కొన్ని కీలక విషయాలను తెలుసుకున్న అధికారులు వాటిని బయటికి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగా సాధారణంగా స్నేహితులందరూ కలిసి మందు పార్టీలు బయటనే చేసుకొంటారు. కానీ డ్రగ్ కేసులో చాలా వరకు పార్టీలు ఎక్కువగా కొందరి ఇంట్లోనే జరిగాయనేది అధికారులు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు ఫలానా వాళ్ల ఇంట్లోనే ఎందుకు చేసుకొంటారు అనే కోణంలో ప్రశ్నలు వేసినట్టు సమాచారం.

Director Puri Jagannadh reveals some secrets about Kelvin and Drugs Charmee

విచారణలో నలభై నిమిషాలపాటు మొదట తన వాదన వినిపించిన పూరీ కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదు కానీ పబ్స్‌కు వెళ్ళే అలవాటు ఉందని చెప్పారు. ఓ దశలో కెల్విన్‌ ఎవరో తెలియదని చెప్పిన పూరీ, కెల్విన్‌తో ఓ మిత్రుడి ద్వారా పరిచయం అయ్యిందని, ఆ తర్వాత అతన్ని ఇండస్ట్రీలో కొంతమందికి పరిచయం చేశానని సిట్ ముందు ఒప్పుకున్నారని సమాచారం. అయితే పరిచయం అయినప్పుడు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడని తెలియదని, ఆ తర్వాత తెలిసిందని చెప్పారట. అంతేగాక సినిమాల కోసమే బ్యాంకాక్‌కు వెళ్తుంటానని, తనకు స్నేహితులు చాలా తక్కువ అని… ఉన్న అందరూ సినిమా మిత్రులేనని చెప్పారట.

అంతేగాక చాలా సినిమాల్లో పబ్స్‌ను షూటింగ్‌లకు వాడుకుంటామని అందుకోసం చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్లు సినిమా షూటింగ్‌లకు సహాయపడ్డారని సిట్ విచారణలో పూరీ బయటపెట్టారు.

See Also: డ్రగ్స్ కేసు: సిట్ విచారణలో పూరీ

Have something to add? Share it in the comments

Your email address will not be published.