సామాన్య ప్రజలు పడిన ఇబ్బందుల్ని చూపించాం: దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి

Director Sunil Kumar Reddy interview about ATM working

Director Sunil Kumar Reddy interview about ATM working

‘గంగపుత్రులు’ వంటి మంచి సందేశాత్మక చిత్రంతో అందరి ప్రసంశలు అందుకున్న పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ప‌వ‌న్‌, కారుణ్య‌ చౌదరి జంటగా న‌టించిన సినిమా `ఏటీఎం వ‌ర్కింగ్‌’. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 17న విడుదలకు రెడీ అయ్యింది. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మీడియాతో  సినిమా విశేషాలను పంచుకున్నారు.

‘ATM వర్కింగ్’ అనే ఈ వెరైటీ టైటిల్ :
ఇక్కడ ATM అంటే అనంత్, త్రిలోక్, మహేష్ అనే ముగ్గురు కుర్రాళ్ళు. వాళ్ళు ముగ్గురు జీవితంలో సెటిల్ అవ్వడానికి కష్టపడుతుంటారు. అందుకే ATM వర్కింగ్ అనే టైటిల్ పెట్టాను.

 కథ
ఈ కథ మోదీ చేసిన డిమానిటైజేషన్ విధానాన్ని అనుసరించి ఉంటుంది. ఆ విధానంలో ఎప్పటికప్పుడు జరిగే కీలక మార్పులను యాడ్ చేసుకుంటూ కథనాన్ని ఏరోజుకారోజు డెవలప్ చేసుకుని సినిమా తీశాం. దాంతో పాటు ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది.

ఆలోచన ఎలా వచ్చింది
ఒకసారి ఏటీఎంలో క్యాష్ కోసం నిల్చుని ఉంటే ఒక హీరో హీరోయిన్ కలుసుకోవడానికి ప్రస్తుతం ఇంతకంటే మంచి సిట్యుయేషన్ మరొకటి ఉండదని అనిపించి కథను హీరో హీరోయిన్లు ఏటీఎంలో కలుసుకోవడం ద్వారా మొదలుపెట్టాను.

డీమానిటైజేషన్ మీద జడ్జిమెంట్ ఏమైనా ఉందా ?
లేదు..అలాంటి తీర్పులేమీ ఇవ్వలేదు. కానీ దాని వలన రోజువారీ జీవితంలో సామాన్య ప్రజలు పడిన ఇబ్బందుల్ని మాత్రం ఎలివేట్ చేశాం. అలాగే సామాన్యుడి నుండి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరు మోదీ నిర్ణయ ప్రభావానికి ఎలా గురయ్యారు అనేది కూడా చూపించాం.

ఎన్ని థియేటర్లలో రిలీజ్
డిజిక్వెస్ట్ తో క‌లిసి చేసిన ఈ సినిమాని బాపిరాజుగారు విడుద‌ల చేస్తున్నారు. మొత్తం మీద 50 స్క్రీన్ లలో సినిమా రిలీజవుతుంది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్  గల్ఫ్ ఎప్పుడు రిలీజ్  ?
జ) ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఉగాదికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ సినిమా కోసం చాలా దేశాలు తిరిగాను. ఇతర ఆసియా దేశాల్లో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.