`ర‌క్ష‌క‌భ‌టుడు` ట్రైల‌ర్ విడుద‌ల

Rakshakabhatudu Trailer released

Rakshakabhatudu Trailer released

ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. కంటెంట్‌ను హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా  సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం  జ‌రిగింది.

ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ `సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌బోతున్నాం. సినిమాను అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ చేయ‌డానికి యూనిట్ స‌భ్యులంద‌రూ రాత్రి ప‌గ‌లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నా ర‌క్ష‌, జ‌క్క‌న్న చిత్రాలకంటే ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. యూనిట్ అంతా ఒక కుటుంబంలా క‌లిసిపోయి త‌మ సినిమాగా భావించి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. నిర్మాత గురురాజ్ గారు కుటుంబ పెద్ద‌లా సినిమా బాగుండాల‌ని కోరుకున్నారు. ట్రైల‌ర్‌లో మీరు చూసిన దాని కంటే ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ సినిమాలో ఉంది. సినిమా ఓ స్టైలిష్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చి సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత.గురురాజ్ మాట్లాడుతూ – `నేను న‌టుడుగా ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేసి స‌ఫ‌లం కాలేక‌పోయాను. ఇప్పుడు నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నాను. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషిగారు ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. అలాగే డ్రాగ‌న్ ప్ర‌కాష్‌గారు ఎక్స‌లెంట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. రిచా ప‌న‌య్ లేడీ టైగ‌ర్‌లా సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌డానికి స‌పోర్ట్ చేసింది.` అన్నారు.

`మా` అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ `ఈ ర‌క్ష‌కభ‌టుడు సినిమాకు ఆ ఆంజ‌నేయ స్వామి ర‌క్ష ఎప్పుడూ ఉంటుంది. గురురాజ్ న‌టుడుగా సినిమా రంగంలోకి వ‌చ్చాడు. కానీ ఇప్పుడు నిర్మాత‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత‌గా గురురాజ్ హీరోలా నిల‌బ‌డాల‌ని కోరుకుంటున్నాను. గురురాజ్‌కు సినిమాలంటే ఎంతో ప్యాష‌న్ ఉంది. ఇలాంటి ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తికి అంత కంటే సినిమాలంటే ప్యాష‌న్ ఉన్న మ‌రో వ్య‌క్తి వంశీకృష్ణ క‌లిశాడు. వీళ్ళిద్ద‌రూ క‌లిసి చేసిన ర‌క్ష‌క‌భటుడు సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

రిచా ప‌న‌య్ మాట్లాడుతూ `ఈ సినిమాలో న‌టించ‌డం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గురురాజ్‌గారు, వంశీకృష్ణ‌గారు ఇచ్చిన ఇన్‌స్పిరేష‌న్‌తోనే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం` అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.