రక్షకభటుడిలో దెయ్యాన్ని దేవుడు కాపాడుతాడంట

రిచాప‌నై, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీ, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకున్న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడింది చిత్ర యూనిట్.

చిత్ర నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ `సుఖీభ‌వ ప్రాప‌ర్టీస్ సంస్థ‌ను ప్రారంభించిన నాకు ప్ర‌జ‌లు ఎంతో స‌పోర్ట్ చేశారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట్ చేశాను. చాలా డిఫ‌రెంట్ క‌థ. సాధార‌ణంగా దేవుడ్ని చూస్తే దెయ్యాలు భ‌యంతో పారిపోతాయి. కానీ ఈ సినిమాలో ఓ దెయ్యాన్ని దేవుడే కాపాడ‌టం విశేషం. వంశీకృష్ణ‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. అర‌కు లోయ‌లో సినిమాను షూట్ చేశాం. ఈ మార్చి 8 నుండి 10 వ‌ర‌కు జ‌రిగే పాట చిత్రీక‌ర‌ణ‌తో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అందుక‌ని యూనిట్ అంతా రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. సినిమా ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో సాగుతూ ప్రేక్ష‌కుల‌ను వంద శాతం ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా. ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. సినిమాలో క‌థే హీరో మంచి క‌థ‌తో పాటు ఇండ‌స్ట్రీలోని ప్యాడింగ్ ఆర్టిస్టులంద‌రూ వ‌ర్క్ చేశారు` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ `ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న 3వ సినిమా ర‌క్ష‌కభ‌టుడు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో కూడిన క‌థే హీరో. ఈ సినిమాకు సంబంధించిన ఆంజ‌నేయ స్వామి పోలీస్ గెట‌ప్‌తో ఉన్న మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాం. మోష‌న్ పోస్ట‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా అంతే రేంజ్‌లో ఆక‌ట్టుకుంటుంద‌ని భావిస్తున్నాను. సినిమాలో ప‌ర్టికుల‌ర్‌గా హీరో అంటూ లేడు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో సినిమా సాగుతుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ సీన్స్‌తో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్ మిక్స్ అయ్యింటుంది. క్లైమాక్స్ చివ‌రి ప‌దిహేను నిమిషాలు అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది.  సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా ప‌క్కా మాస్ ట్యూన్ అందించాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చంద్ర‌గారు. సినిమా 90 శాతం అర‌కులోయ‌లోని ఓ పోలీస్ స్టేష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అందుకోసం రాజీవ్‌నాయ‌ర్‌గారు అద్భుత‌మైన సెట్ వేశారు. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాం. ` అన్నారు.

హీరోయిన్ రిచా ప‌నయ్ మాట్లాడుతూ `ఈ సినిమాలో చాలా కీల‌క‌మైన పాత్ర చేశాను. యూనిట్ అంతా ఓ ఫ్యామిలీలా క‌లిసిపోయి సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అర‌కులోయ‌లోని పోలీస్ స్టేష‌న్‌, నా క్యారెక్ట‌ర్ చుట్టూ తిరుగుతుంది` అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.