డీజే లొల్లి: యుద్ధం శరణం గచ్ఛామి

DJ Duvvada Jagannatham director Harish Shankar controversial Tweets on websites

దువ్వాడ జగన్నాథం లొల్లి ఇంకా కొనసాగుతోంది. డీజే మూవీపై సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు వచ్చినప్పటినుండి మొదలైన రచ్చ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. డీజే సినిమా పెద్ద ఫ్లాప్ అని, కలెక్షన్లు అన్నీ ఫే‌క్‌వే చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్లు దుమారానికి తెరలేపింది.

DJ Duvvada Jagannatham director Harish Shankar controversial Tweets on websites

13 రోజులు పూర్తి చేసుకున్న ‘డిజె’ దువ్వాడ జగన్నాధం నైజాం(తెలంగాణ) ప్రాంతంలో ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది, ఏ జిల్లాలో ఎంత రాబట్టింది అనే విషయాలు అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ సినిమా నైజాంలో  20 కోట్ల మార్కును అందుకుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ చేసిన ట్వీట్లు మరో రచ్చకు కారణం అయ్యాయి. నా కెరీర్లో నైజాంలో 20 కోట్లు వసూలు చేసిన రెండు సినిమాలు ఉండటం గర్వంగా ఫీలవుతున్నాను. అప్పుడు ‘గబ్బర్ సింగ్’, ఇపుడు ‘డిజె’ మూవీ ఈ ఘనత సాధించాయి అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

అంతేగాక ఈ వివరాలను ట్వీట్ చేస్తూ ఈ వసూళ్ల లెక్కలు తప్పు అని నిరూపిస్తే…. నేను సినిమాలు తీయడం మానేస్తాను, మరి మీరు మీ వెబ్ సైట్లు మూసుకుంటారా? అంటూ సవాల్ విసిరారు హరీష్. విమర్శలు ఎంత వరస్ట్ గా ఉన్నా నేను స్వీకరిస్తాను. కానీ నా సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్ల హార్డ్‌వర్క్ శంకిస్తే మాత్రం సహించను. మాపై పగబట్టినట్లు ఫేక్ ఆర్టికల్స్ రాసి అవమానించారు అంటూ హరీష్ శంకర్ ఫైర్ అయ్యారు. చివర్లో… ‘సారి గైస్ నేను సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్లోనే ఉన్నాను. ఇలాంటి ట్వీట్లు చేయాలని నాకు కూడా లేదు. కానీ తప్పట్లేదు… యుద్ధం శరణం గచ్చామి’ అంటూ ట్వీట్ చేశాడు.

మొత్తానికి ఒక సినిమాకు సంబంధించి వివాదాలు జరగడం… ఏదో ఒక స్థాయిలో సెటిల్ అవుతుంటాయి. అయితే డీజే సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సెటిల్మెంట్ జరగకపోవడం ఒకవైపైతే, ట్లీట్లు చేసుకుంటూ ఆగిపోయిన వివాదాన్ని మళ్ళీ మొదలుపెడుతున్నారు.

See Also: ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ షురూ

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.