ఆత్మహత్యలకు పాల్పడవద్దు

Do not get suicide janasena party chief pawan kalyan

Do not get suicide janasena party chief pawan kalyan

విజయవాడ: అగ్రి గోల్డ్ బాధితులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గత వారమే ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే కొంత ఆలస్యంగా సమావేశం అవుతన్నారు. సుమారు 650 మంది బాధితులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ ముఖా ముఖిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందమందికి పైగా అగ్రి గోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో వారి సమస్యలు ఏంటో తెలసుకునేందుకు పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు పవన్.

తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్న పవన్ కల్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ “ముందుగా అగ్రి గోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆపాలి. ఈ వ్యవహారం చిక్కుముడి లాంటిది. దీనిని జాగ్రత్తగా కూర్చోని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీనిని ఎలా పడితే అలా చేసేది కాదు. ఇందులో కొంతమంది మంత్రుల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయని విలేకరుల అడగ్గా ఇది కేవలం అభియెగాలు మాత్రమే. అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఇలాంటివి రావడం సహజం. నేను ఏమీ తెలుసుకోకుండా వారిపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అగ్రి గోల్డ్ వ్యవహారం కోర్టులో ఉండి కూడా దీనిని ఎందుకు తాత్సర్యం చేస్తున్నారో తెలియడం లేదు. అగ్రి గోల్డ్ ఆస్తులు 14 వేల ఎకరాలు. ఇన్ని వేల ఎకరాలు ఎక్కడున్నాయి, ఏ పరిధిలో ఉన్నాయి, ఏఏ ఊళ్లల్లో ఉన్నాయో, వీటి విలువెంతో ప్రభుత్వం తెలుసుకోవాలి. దీనిపై ప్రభుత్వం ఒక నివేదికను తయారుచేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలని“ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.