ఆదివాసీ మహిళా నాయకురాలే మన తర్వాతి రాష్ట్రపతా?

Draupadi Murmu to be the next President?

Draupadi Murmu to be the next President?

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ తమ అభ్యర్ధుల పేరును బయిటపెట్టకపోవడంతో ప్రజలలో ఆసక్తి పెరగడమే కాదు, రకరకాల ఊహాగానాలకు తావిస్తున్నది.

ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, చివరికి రజనీకాంత్ వంటి వారి పేర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పేర్ల మధ్యనే ఒక మహిళ పేరు కూడా పేలవంగా వినిపించింది. ఆమే ద్రౌపది ముర్ము.  జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న ఆమె ఆదివాసి కూడా. రాజకీయ అనుభవం, మహిళ కావడమే కాదు ఆదివాసీ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమె పేరును వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారని తెలుస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా ముర్ము రాజకీయాలలో ఉన్నారు. ఒరిస్సాలో పుట్టిపెరిగిన ఈమె అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. తండ్రి “బిరంచి నారాయణతుడు”.

ముర్ము  ఏ పని చేసినా నిబద్ధతతో చేస్తారనే విషయం ఆమెకు వచ్చిన అవార్డులే చెప్తాయి.

2007 వ సంవత్సరంలో ఒరిస్సా శాసనసభ ద్రౌపది ముర్ముకి ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈమె ‘నీలకంఠ’ అవార్డు గ్రహీత కూడా. 1997 లో మొట్టమొదటి సారిగా కౌన్సిలర్ గా ఎన్నికైన ఆమె, తర్వాత రాయ్ రణపూర్ ఎన్ఎసి కి వైస్ చైర్మన్ అయ్యారు. తరువాత రాయ్ రణపూర్,  ఒరిస్సా నియోజకవర్గాలనుండి MLA గా ఎన్నికైన గానీ, తరువాత రాష్ట్ర మంత్రి గా కూడా పనిచేసారు. 2002 -2009 మధ్య కాలంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, ఎస్టీ మొర్చా సభ్యులు గా ఉన్నారు.

ప్రచారంలో ఉన్న ఊహాగానాలు నిజమైతే ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం పూర్తి కాగానే ఆ పదవిని చేపడతారు. అదే జరిగితే ఆమె చరిత్ర పుటల్లోకి తొలి ఆదివాసీ మహిళా భారత రాష్ట్రపతిగా ఎక్కుతారు. ప్రతిపక్షాలు కూడా ఈమె సభ్యత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితులు లేవని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

Have something to add? Share it in the comments

Your email address will not be published.