రాజకీయ రంగు పులుముకుంటున్న డ్రగ్స్ కేసు

Drug Case KTR slams Digvijaya Singh on allegations in Twitter

డ్రగ్స్ కేసుకి రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇన్ని రోజులు ఈ కేసు బయటపడ్డప్పటినుండి మొదట కార్పోరేట్ స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ వినియోగంపై చర్చ జరిగి ఆ తర్వాత టాలీవుడ్‌లో సెలబ్రిటీలను కేసులోకి లాగేసింది.

Drug Case KTR slams Digvijaya Singh on allegations in Twitter

అయితే తెలుగు సినిమా పరిశ్రమలో 12మందికి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణాధికారి అకున్ సభర్వాల్ సెలవులోకి వెళ్తున్నానని ప్రకటించేవరకు రాజకీయ నాయకులు ఎవరూ స్పందించలేదు. ఒక్కసారిగా అకున్ సెలవు విషయం తెరపైకి వచ్చేసరికి రాజకీయ రంగు పులుముకోవడం మొదలైంది. అయితే ఆ తర్వత రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై కేసులో ఎలాంటివారున్నా వదిలిపెట్టొద్దని సూచించిన తర్వాత మళ్ళీ రాజకీయ ప్రకంపనలు సద్దుమణిగాయి.

అయితే ఈరోజు ఉదయం  డ్రగ్స్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేయడంతో మళ్ళీ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కేసులో సినీ ప్రముఖులను సిట్‌ నిన్నటి నుంచి విచారిస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్ చేసిన ట్వీట్‌కు తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఇచ్చిన ఘాటైన సమాధానం మళ్ళీ ట్విట్టర్ యుద్ధానికి తెరలేపింది. ‘తెలంగాణలో అతిపెద్ద డ్రగ్స్‌ కుంభకోణం. ప్రభావితం చేయగల తెరాస నేతల మిత్రులు కూడా ఉన్నారు. మరి వారిని రక్షిస్తారా..? విచారిస్తారా? వేచి చూడాలి’ అంటూ ట్వీట్‌ చేశారు దిగ్విజయ్‌సింగ్.

అయితే దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. ‘మీరు పూర్తిగా విచక్షణ కోల్పోయారు. గౌరవంగా రిటైర్‌ కావాల్సిన సమయం దగ్గరపడింది. మీ వయసుకు తగ్గట్టుగా నడుచుకోండి. తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయడం నేర్చుకున్నందుకు సంతోషమ’ని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దిగ్విజయ్‌ సింగ్‌ గతంలో ట్విటర్‌లో తెలంగాణ స్పెల్లింగ్‌ను తప్పుగా రాసారు.

See Also: కేటీఆర్, దిగ్విజయ్ మధ్య ట్విట్టర్ వార్

మొత్తానికి గతంలోనూ ట్విట్టర్ సాక్షిగా పరస్పర వాదోపవాదాలు చేసుకున్న డిగ్గీరాజా, కెటిఆర్‌లు డ్రగ్స్ కేసు సాక్షిగా మరోసారి మాటల యుద్ధానికి దిగారు. తెలంగాణ పోలీసులపై అప్పట్లో దిగ్విజయ్‌ సింగ్‌ వివాదాస్ప వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక  హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా పట్టుబడడంతో సినీ ప్రముఖులను ప్రత్యేక పోలీసు బృందం(సిట్‌) విచారిస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్‌ తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

See Also: పంచ్‌లు వేసే పూరీకే సిట్ పంచ్‌లు

Have something to add? Share it in the comments

Your email address will not be published.