పనిచేసిన ప్రచారం – సెలవులు రద్దు

Drug Case officer Akun Sabharwal cancels his leave after public backlash

డ్రగ్ రాకెట్‌ను బయటపెట్టి అందరికీ చెమటలు పట్టిస్తున్న అకున్ సభర్వాల్ సెలవు విషయంపై  పెద్ద ఎత్తున చర్చ జరుగడం… డ్రగ్ మాఫియా తలుచుకుంటే ఎంతటివారిపైనైనా తమ అజమాయిషీ నడిపించి తమ పనులు చేసుకుంటుందని పుకార్లు రావడంతో పరిస్థితిని చక్కదిద్దారు అకున్ సభర్వాల్.

Drug Case officer Akun Sabharwal cancels his leave after public backlash

ఏదైనా పెద్ద కేసుని, పెద్దవాళ్ళని కదిలించడానికి ప్రయత్నిస్తే రాజకీయ ఒత్తిళ్ళు ఏరకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అదే ఏదైనా సున్నితమైన కేసు విషయంలో అయితే రాజకీయ ఒత్తిళ్ళు ఎంత సిన్సియర్ అధికారికైనా తప్పవని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. డ్రగ్స్ కేసులో మాఫియా కోరలు పీకుతారని, ఎంతపెద్ద వాళ్ళకైనా ఇక కష్టాలు తప్పవని అందరూ అనుకుంటుంటే  డ్రగ్స్ పై హడావిడి చేసిన అధికారి అకున్ సబర్వాల్ సెలవు పెట్టేయడంపై పెద్ద దుమారమే చెలరేగింది. అసలు కేసు కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో అకున్ సెలవు తీసుకోవడం రాజకీయ ఒత్తిళ్ళ వల్లే అని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. సినీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య సత్సంబంధాలు చెడిపోకుండా ఉండేందుకే అడ్డుగోడగా ఉన్న పోలీసు అధికారి అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లారని మీడియా మొత్డంతం కోడై కూసింది.

See Also: మత్తు కథా చిత్రంలో మరో ట్విస్ట్ – సెలవులో అకున్ సభర్వాల్

ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో విచారణ చేపడుతున్న ఎక్సైజ్‌ డీజీ అకున్‌ సబర్వాల్‌ సెలవులు రద్దు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తి అయ్యేవరకూ సెలవులు వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. అయితే తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన వివరించారు.

గతంలో నయీం కేసు విషయంలోనూ జరిగిన హడావిడి సైతం అంతా ఇంతా కాదు. పెద్ద ఎత్తున దుమారమేరేపింది. అందులో కావాలని మీడియాలో హడావిడి కోసం ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు, పోలీసు బాసుల పేర్లు బయటకి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటారనుకుంటే అందుకోసం సిట్ వేసి తీరా అందరూ మంచివారేనన్నట్లు కేసును మూసేశారు. ఈ కేసులోనూ అదే హడావిడి జరుగుతోందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

See Also: డర్టీ పిక్చర్ : డ్రగ్స్ కేసులో బయటపడుతున్నమేకప్

రవితేజ త‌మ్ముడు భ‌ర‌త్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ రోజునుండి చాప‌కింద నీరులా సాగిన విచార‌ణ ఒక్క‌సారిగా బాంబులా పేలింది. హైద‌రాబాద్‌నే కాకుండా సినిమా ప‌రిశ్ర‌మ‌ను కుదిపేసింది. సినీ ప్ర‌ముఖులు ఒకే వేదిక‌పైకి వ‌చ్చి, సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.