డ్రగ్స్ కేసు: సిట్ విచారణలో పూరీ

Drugs Case Puri Jagannadh appears before SIT in Hyderabad

కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో టాలీవుడ్ విచారణ మొదలైంది. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సినీ ప్రముఖులు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఎక్సైజ్ శాఖ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. వీరందరిని రోజుకు ఒక్కొక్కరు చొప్పున ఆగస్టు 2 వరకు సిట్‌ అధికారులు విచారించనున్నారు.

Drugs Case Puri Jagannadh appears before SIT in Hyderabad

విచారణలో భాగంగా దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ముందు హాజరయ్యారు. కొద్ది రోజులుగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పూరి ఈరోజు ఉదయం కుమారుడు ఆకాష్‌తో పాటు, తమ్ముడు సాయిరామ్ శంకర్‌, న్యాయవాదులతో కలిసి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.

See Also: నేనేం స్టేట్‌మెంట్ ఇవ్వలేదు: పూరీ జగన్నాథ్

నోటీసులు అందుకున్న రోజు నుంచే న్యాయనిపుణలతో చర్చిస్తున్న పూరి, ఎక్సైజ్ అధికారుల అడగబోయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మంది పూరికి సన్నిహితులు కావటంతో ఈ రోజు జరగబోయే విచారణలో కీలక అంశాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

See Also: నా కొడుకు బంగారం

ఈమధ్య పోలీసులకు చిక్కిన డ్రగ్స్‌ మాఫియా డాన్‌ కెల్విన్‌ ఫోన్‌ విశ్లేషణలో లభించిన వివరాలు, విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి మత్తుమందులు సరఫరా చేసినట్లు ఖరారైంది. అందులోభాగంగా ఆ సెలబ్రిటీల నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వాళ్ళని విచారించాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు.

అయితే సాధారణంగా జరిగే విచారణకు భిన్నంగా టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేయనున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.