డర్టీ పిక్చర్ : డ్రగ్స్ కేసులో బయటపడుతున్నమేకప్

Drugs Racket Tollywood top names out in Drugs case notices

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో బయటపడుతున్న పేర్లు తెలుగు సినీ పరిశ్రమనే వణికించేస్తున్నాయి. డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ సెల్‌ఫోన్‌ కాల్‌డేటా విశ్లేషణలో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వస్తున్నాయి. ఏడాదిగా కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ అందుకుంటున్న వారి వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఛేదించింది. కాల్‌డేటాలో అనుమానాస్పదంగా ఉన్న 48 నంబర్లను విశ్లేషించారు. అందులో సినీ రంగానికి చెందిన కొందరి వివరాలను తెలుసుకోగలిగారు. ఇప్పటికే వారిలో కొందరిని రహస్యంగా విచారించి, వారి కాల్‌డేటాను కూడా విశ్లేషించగా.. అందులో ప్రముఖుల ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే వారంతా డ్రగ్స్‌ తీసుకుంటున్నారా? లేదా మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్నారా అన్న అంశాన్ని లోతుగా విచారిచేందుకే నోటీసులు జారీచేసారు అధికారులు.

Drugs Racket Tollywood top names out in Drugs case notices

అంతేగాక డ్రగ్స్‌ వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్‌, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామేన్‌ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్‌, తరుణ్, నందు క్యారెక్టర్‌ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాలకు నోటీసులు వచ్చాయంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే వీరి పేర్లను ఎక్సైజ్‌ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.

See Also: 15మంది నటీనటులపై అల్లు అరవింద్ సీరియస్

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నామని, ఇప్పటికే 10 మందికి నోటీసులు ఇచ్చామని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు లిస్టులో ఉన్నారని వెల్లడించారు. నోటీసులు ఇచ్చిన వారిని సిట్‌ ఆఫీసులోనే విచారిస్తామని తెలిపారు. హీరోయిన్లను సిట్‌ ఆఫీసులో కాకుండా బయట విచారిస్తామన్నారు. విచారణ అంశాలు బయటకు వెల్లడించబోమని స్పష్టం చేశారు. అయితే నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

Have something to add? Share it in the comments

Your email address will not be published.