ఢిల్లీలోనే దినకరన్ పూర్తిస్థాయి విచారణ

EC bribery case AIADMK leader Dhinakaran interrogation continues back in Delhi

EC bribery case AIADMK leader Dhinakaran interrogation continues back in Delhi

తమిళ రాజకీయాలను ఒక ఊపు ఊపిన దినకరన్ కేసు మళ్ళీ హస్తినకు చేరింది. రెండాకుల గుర్తు శశికళ వర్గానికి దక్కడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్‌ను పోలీసులు చెన్నై నుంచి ఢిల్లీకి తరలించారు. దినకరన్‌ను గురువారం చెన్నైకి తీసుకొచ్చిన పోలీసులు అడయార్‌లోని నివాసంలో గత రెండు రోజులుగా విచారణ చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు  ఇదే కేసులో అరెస్టయిన ఆయన స్నేహితుడు మల్లికార్జున్‌ అన్నానగర్‌ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. వీరి వద్ద నుంచి కొన్ని కీలక సాక్ష్యాలు సేకరించారు.

ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దినకరన్‌ను రాజాజీభవన్‌నుండి ఢిల్లీకి తీసుకెళ్ళారు. చేరుకున్నారు. అక్కడే పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకు 50 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో టీటీవీ దినకరన్ వెనక ఉన్నది మన్నార్‌గుడి మాఫియా అనే అంచనాకు వచ్చేశారు.

ఐదు రోజుల కస్డడీలో ఉన్న దినకరన్‌ను ఢిల్లీలో విచారణ జరిపిన తర్వాత కేసుకు సంబంధించిన నివేదికను తయారు చేయనున్నారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ముందస్తుగా ఆయనకు లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.