రాజకీయ పార్టీలకు బహిరంగ సవాల్

EC gives Open Challenge for all political parties to tamper EVMs

EC gives Open Challenge for all political parties to tamper EVMs

ప్రజల్లో భయాందోళనలు పెంచడానికి, ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదని, ఎవరైనా టాంపరింగ్ చేసుకోవచ్చనే విధంగా ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగ ఛాలెంజ్‌ను విసిరింది. అయితే నేరుగా ఆప్‌ను ఉద్దేశించి సవాల్‌ విసరకపోయినా దేశంలో ఉన్న అన్ని రాజకీయాపార్టీలకు ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి చూపించాలని ఎన్నికల కమిషన్‌ బహిరంగ ఛాలెంజ్‌ విసిరింది. అందులోభాగంగా జూన్‌ 3 నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల లోపాలు ఉంటే నిరూపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి జైదీ ప్రకటించారు.

రాష్ట్ర, జాతీయ పార్టీలకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను తమ వెంట తెచ్చుకొని ట్యాంపరింగ్‌ చేసి నిరూపించవచ్చు. ఈసీ సవాలుపై ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్లు మే 26 సాయంత్రం 5గంటలోపు తమ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని జైదీ స్పష్టంచేశారు. అయితే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ట్యాంపరింగ్‌ జరిగినట్లు సరైన ఆధారాలు లేవని, ఎవరైతే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారో ఆయా పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎటువంటి ఆధారాలు చూపించలేదని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నసీమ్‌ జైదీ స్పష్టంచేశారు.

ఈవీఎంలను తారుమారు చేయడం ఏమాత్రం సాధ్యపడదని, అందులోని ఇంటర్నల్‌ సర్క్యూట్‌ను మార్చడం అంత సులువు ఏమాత్రం కాదని, ట్యాంపరింగ్‌ జరగకుండే విధంగా బలమైన సాంకేతిక ఫీచర్లు అందులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 13.95లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 9.3లక్షల బ్యాలెట్‌ కంట్రోల్‌ యూనిట్స్‌, 16.5లక్షల వీవీపీఏటీ యంత్రాలను తయారుచేస్తున్నట్లు జైదీ వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.