ఇది ప్రజా విజయం

eclection result 2017: press conference by amit shah after bjp massive victory in utter pradesh, uttarakhand

eclection result 2017: press conference by amit shah after bjp massive victory in utter pradesh, uttarakhand

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పలితాలు చరిత్రాత్మకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్నారు. పంజాబ్ లో ఓటమి పాలైనా 30 శాతం ఓట్లు సాధించామన్నారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాలకు కొత్త దిశను నిర్దేశిస్తాయని తెలిపారు.

2017 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై డిల్లీలో బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా విలేకరులతో మాట్లాడుతూ ఈ ఫలితాలు బీజేపీని మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్లో 3 వంతుల సీట్లు సాధించాం. ఈ గెలుపుతో బేజీపీ మీద మరింత బాధ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం వచ్చాక అత్యంత ప్రజాదరణ కలిగినే నేత మోడీనే, అందుకే ప్రజలు కూడా మోడీ నిర్ణయాలకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికలలో ఎక్కడా కూడా నొట్ల రద్దు ప్రభావం కనిపించలేదన్నారు. అదే విధంగా కులం, మతం, ప్రాంతం ఏదీ కూడా ఈ ఎన్నికలలో పని చేయలేదని, కేవలం మోడీ అభివృద్ధి మంత్రం ఒక్కటే పనిచేసిందని అమిత్ షా పేర్కొన్నారు.

రేపు సా 4 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులను నిర్ణయించునున్నట్లు అమిత్ పేర్కొన్నారు. అదే విధంగా మణిపూర్, గోవాలో ప్రభుత్వ ఏర్పటుపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

రేపు బీజేపీ విజయోత్సవంలో పాల్గొననున ప్రధాని మోదీ పాల్గొంటారని అమిత్ షా తెలిపారు. భారీ విజయం ఇచ్చిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా బీజేపీ విజయానికి కృషి చేసిన కోట్లాదిమంది కార్యకర్తలకు కూడా అమిత్ షా శుభాకాంక్షలు చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.