అవసరమైతే ఎన్నికలు..

election-commission-announces-schedule-for-presidential-elections

election-commission-announces-schedule-for-presidential-elections

వచ్చే నెల 24తో ముగుస్తున్న రాష్ట్రపతి పదవీకాలానికి ముందే ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించడం ఆనవాయితీ. అయితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టి మద్దతు ప్రకటిస్తే ఏకగ్రీవంగా వారినే రాష్ట్రపతిని చేస్తారు. అయితే ఒకవేళ అధికారపార్టీ నిలబెట్టిన అభ్యర్థికి పోటీగా ఎవరైనా నిలబడితే ఎన్నికలు తప్పనిసరిగా జరగాల్సిందే.

అందుకే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. చీఫ్ ఎలక్ష‌న్ క‌మిష‌న‌ర్ నసీం జైదీ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించారు.  నామినేష‌న్ల దాఖ‌లుకు జూన్ 28 చివ‌రి తేదీ అని, ఒక‌వేళ ఎన్నిక అవ‌స‌ర‌మైతే జులై 17న నిర్వ‌హిస్తామ‌ని, జులై 20 కౌంటింగ్ ఉంటుంద‌ని ప్రకటించారు.

ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం జులై 24తో ముగియ‌నుంది. ఎన్డీయే ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థిపై ఏకాభిప్రాయం రాక‌పోతే.. త‌మ త‌ర‌ఫున మ‌రో అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తామ‌ని సోనియాగాంధీ నేతృత్వంలోని ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తుతో తాము ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థిని గెలిపించుకోగ‌ల‌మ‌ని బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు భావిస్తున్నాయి.

మెజార్టీ పార్టీలు ఆమోదించే విధంగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పారు. దీనివ‌ల్ల ఎన్నిక అవ‌స‌రం ఉండ‌ద‌ని దీదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

రాజ్యాంగంలోని 324వ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నిలబడే రాష్ట్రపతి అభ్యర్థిని కనీసం 50 మంది ప్రజాపతినిధుల ప్రతిపాదించాల్సి ఉంటుందని, మరో 50 మంది బలపర్చవలసి ఉంటుందని సీఈసీ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.