‘లంక’లో రెచ్చిపోయిన ఐనా సాహా

Ena Saha specail dance performance gives more boost to Lanka

Ena Saha specail dance performance gives more boost to Lanka

రాశి కీలకపాత్రలో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “లంక”.  ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నామన శంకర్రావు-సుందరిలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఇది.  కథానాయికగా నటిస్తున్న ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. టెలీపతి నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది.  ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న “లంక” తప్పకుండా సూపర్ హిట్ అవుతుందన్నా నమ్మకం ఉంది” అన్నారు.

Ena Saha specail dance performance gives more boost to Lanka1

Have something to add? Share it in the comments

Your email address will not be published.