గడ్డిఅన్నారం మార్కెట్ వద్ద రైతుల ఆందోళన

Farmers conducted rasta rokho at LB Nagar Dilsukhnagar highway

Farmers conducted rasta rokho at LB Nagar Dilsukhnagar highway

హైదరాబాద్: ఇథలిన్ వాడుతున్నారన్న నేపథ్యంలో విజిలెన్సు అధికారులు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ లో దాడులు చేపట్టారు. దీంతో ఇథలిన్ వాడకం పై ఆంక్షలను నిరసిస్తూ వ్యాపారస్తులు కొనుగోలు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలకు గురైయ్యారు.

వివిధ జిల్లాల నుండి ఎంతో మంది రైతులు వారు పండించిన పంటను అమ్ముకోవడానికి గడ్డిఅన్నారం మర్కెట్ కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి మార్కెట్ లో విజిలెన్సు అధికారులు దాడులుచేస్తున్న కారణంగా వ్యాపారస్తులు కోనుగోళ్లను నిలిపివేసారు. దీంతో మార్కెట్ బయటే లారీలు బారులు తీరాయి. నిన్నటి నుండి వ్యాపారస్తులు కోనుగోళ్లు నిలిపివేయడంతో సరుకును ఏంచేసుకోవాలో అర్ధం గాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని రైతులు తెలుపుతున్నారు.

మార్కెట్ లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మార్కెట్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఒకవైపు వ్యాపారస్తులు మరోవైపు అధికారులతో రైతులు నలిగిపోతున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రైతులు అధికారులనుండి ఎలాంటి స్పందన రాకపోడంతో రైతులు దిల్ సుఖ్ నగర్, ఎల్బినగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.