అయ్యో రైతన్నా…

Farmers still suffer due to demonetisation

వర్షా కాలం వచ్చింది. రైతులకు ఖరీఫ్ సీజన్ మొదలైంది. గత సంవత్సరం కంటే ఈ ఖరీఫ్ కు కాలం కూడా కలిసి వచ్చింది. సకాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఎంతో ఆనందంతో ఉన్నారు. రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి నారుపోసే సమయం ఆసన్నమైంది. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు రైతులు చేతిలో డబ్బులు లేక విలవిలలాడి పోతున్నారు.

Farmers still suffer due to demonetisation

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్నట్టుగా మారింది రైతన్నల పరిస్థితి. ఖరీఫ్ సీజన్ ఆరంభంలొ విస్తారంగా వర్షాలు కురియడంతో సంబరపడ్డ రైతన్న ఇప్పుడు ఆందోళనలో పడ్డాడు. కరెన్సీ కష్టాలు అన్నదాతలను అష్టకష్టాలు పాలుచేస్తుంది.

ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే కురిసిన వర్షాలతో రైతన్నలు సంతోషపడ్డారు. సాధారణంకంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. దీంతో అన్నదాతలు దుక్కులు దున్ని పంటు సాగుచేసే పనిలో పడ్డారు. వాతావరణం చల్లబడటంతో సాగుబడికి ఇక ఢోకా లేదనుకుంటున్న రైతన్నలను కరెన్సీ కష్టాలు వెన్నంటుతున్నాయి. ధాన్యం అమ్మకం ద్వారా వచ్చిన అధిక మొత్తం బ్యాంకు ఖాతాల్లోనే ఉంది. దీంతో రైతులు నిత్యం బ్యాంకుల వద్ద బారులు తీరి నగదు కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఏ బ్యాంకు వద్ద చూసినా రైతులే కనిపిస్తున్నారు. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగినా రోజుకు రెండు వేలు లేదా వారానికి పదివేలు కంటే ఎక్కువ ఇవ్వక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఏ రైతుని కదిలించినా కరెన్సీ కష్టాలు ఏకరువు పెడుతున్నాయి. గత పంటకు చేసిన అప్పులు చెల్లింపులు చేయలేక, బ్యాంకుల నుంచి డబ్బులు రాక వడ్డీలు పెరిగిపోయి, పెట్టుబడికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైతుల ఖాతాలో డబ్బులు, మార్కెట్లో కావల్సినన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నా పెట్టుబడికి సకాలంలో డబ్బులు అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం పాలకులు పట్టింపులేని ధోరణితో వ్యవహరించడంతో అన్నదాతను తీవ్ర ఇక్కట్లకు పాలవుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరెన్సీ కష్టాలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.