ఈ నెల 24న నానీ పుట్టిన రోజు

ఇప్పటి యువ హీరోలు ఒకప్పటిలా లేరు. అదివరకటి హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలకంటే చేసేవారు కారు. కానీ ఇప్పుడలా కాదు. ఎన్ని సినిమాలు చేయగలిగితే అన్ని సినిమాలు చేస్తున్నారు. సినిమాలు చేయడమే కాకుండా, విజయాలను కూడా ఇస్తున్నారు. దాంతో  ఒక్కసారిగా వారి అవకాశాలను పెంచేసుకుంటున్నారు. అందువల్ల తొందరగా స్టార్ డమ్ లోకి వచ్చేస్తున్నారు. ఈమధ్య వరస విజయాలతో ప్రేక్షకులను అలరించి, అభిమానం పొందిన హీరో నాని పుట్టిన రోజు ఈ నెల 24న.

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ స్టర్స్ లో క్రేజీ హీరో ఎవరంటే అందరూ చెప్పే ఒకే పేరు నాని. అష్టాచమ్మా తో నాని సినిమా కెరీర్ మొదలైంది. ప్రారంభం లోనే మంచి రోల్స్ వేసి బాగా చేస్తాడు అనిపించుకున్నాడు.  ఆ తర్వాత `ఈగ`, `ఏటో వెళ్ళిపోయింది మనసు`, `జెండాపై కపిరాజు`, `ఎవడే సుబ్రహ్మణ్యం` వంటి చిత్రాలతో హీరోగా నాని ప్రూవ్‌ చేసుకున్నాడు.

నానిని చూస్తే మన ఇంట్లో అబ్బాయిలా  కనిపిస్తాడు. మనింట్లో కుర్రాడు మాత్రమే కాదండోయ్ … అమ్మాయిలచేత  భలే భలే  మగాడివోయ్ అని కూడా అనిపించుకున్నాడు. ఇప్పుడు వెరీ రీసెంట్ గా ‘నేను లోకల్’ సినిమా సాధించిన సక్సెస్ తో ఉత్సాహంగా  వున్న నాని నెక్స్ట్ పిక్చర్ షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను శాన్ ఫ్రాన్సిస్కో .. లాస్ ఏంజిల్స్ లో తీస్తున్నారు.

ఈసారి నాని బర్త్ డే కి విశేషమేంటంటే .. ..ఈ సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్  నానికి బర్త్ డే గిఫ్ట్ గా ఇస్తున్నారు. జెంటిల్ మన్’, నేను లోకల్ తర్వాత ఆ రేంజ్ లో మేకింగ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. మరో విశేషం కూడా చెప్పాలి.

ఒకప్పటి మాదిరి ఇప్పుడు  హీరోలు గిరిగీసుకొని కూచోడం లేదు. ఇమేజ్ గీతల్ని దాటి  గెస్ట్ రోల్స్ కూడా వేస్తున్నారు . నాని కూడా తను హీరోనని అనుకోకుండా గెస్ట్ రోల్స్ కూడా వేస్తున్నాడు. నానికి మరోసారి బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.