అక్వా పరిశ్రమలో ప్రమాదం, ఐదుగురి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా: మొగల్తూరులో విషాదం చోటు చేసుకుంది. ఆనంద్ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో దుర్ఘటన జరగింది. రసాయన ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ట్యాంక్ లు శుభ్రం చేస్తున్న సమయంలో విష వాయువు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గాలి పీల్చడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, తోట శ్రీను, జక్కంశెట్టి ప్రవీణ్‌లను మృతి చెందినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మరో మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తును చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.