తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం

చెన్నై : విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తుండగా, వారికి డీఎంకే కూడా అండగా నిలిచింది.

ఎమ్మెల్యేలను ఖైదీల్లా తీసుకొచ్చారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. అయితే పన్నీర్ సెల్వం నియమించిన విప్‌ను ఒప్పుకోడానికి పళనిస్వామి వర్గం ఒప్పుకొనేందుకు సిద్ధంగా లేరు. అదే విధంగా రహస్య ఓటింగుకు కూడా వాళ్లు అంగీకరించడంలేదు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పన్నీర్ సెల్వం అన్నారు. తాము ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్న ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం కల్పించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది.

రహస్య ఓటింగు జరపాలని పన్నీర్, స్టాలిన్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటింగు కుదరదన్న స్పీకర్ ధన్ పాల్ తెలిపారు. గందరగోళం మధ్యనే ఓటింగును స్పీకర్ నిర్వహిస్తున్నారు.

ఓటింగు ప్రక్రియను పన్నీర్, డీఎంకే వర్గం అడ్డుకోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.