చిన్నారి కోసం ప్రోటోకాల్‌ను పక్కనబెట్టిన ప్రధాని

For a 4 years girl PM Narendra Modi convoy stopped and greeted her

For a 4 years girl PM Narendra Modi convoy stopped and greeted her

దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఓ నాలుగేళ్ళ చిన్నారిని కలిసారు. గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళిన నరేంద్రమోడీకి ఓ వింత అనుభూతి ఎదురైంది.  సూరత్‌లో కార్యక్రమాల్లో పాల్గొనడానికి  బయటికి వెళ్ళిన మోడీ కాన్వాయ్‌కు ఓ నాలుగేళ్ల బాలిక అడ్డొచ్చింది.

ఒక‌ ద‌గ్గ‌ర నాలుగేళ్ల చిన్నారి ప్ర‌ధాని మోదీ వాహ‌నం వైపుగా దూసుకెళ్లింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తాధికారులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. పాప‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. వాహ‌నం నుంచి ఇదంతా గ‌మ‌నించిన మోదీ ఆ పాప‌ను క‌లిసేందుకు కారు దిగారు. ఆ చిన్నారి పేరు నాన్సీ. అయితే ఆ పాప చేతి గ‌డియారం పెట్టుకున్న‌ది. ఆ వాచ్‌ను చూపిస్తూ స‌మ‌యం ఎంత అయ్యింద‌ని ప్ర‌ధాని మోదీ ఆ పాప‌ను ప్ర‌శ్నించారు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ మోదీ కాన్వాయ్‌లో క‌దిలి వెళ్లారు. దాంతో ప్రధాని మోదీ తన కారును ఆపి ఆ పాపను కలిశారు.  రోడ్డు మీద జ‌నం అంతా ప్ర‌ధాని కాన్వాయ్‌ను చూస్తూ ఉండిపోయారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.