కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూత

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి  పుంజల శివశంకర్‌ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం జూబ్లీహిల్స్‌ లోని స్వగృహంలో మృతి చెందారు. కేంద్రమంత్రిగా, కేరళ మరియు సిక్కిం రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన శివశంకర్ ఆగస్టు 10, 1929న హైదరాబాదులో జన్మించారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి లోకసభకు, రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాలలో స్థానం పొందారు.

కేంద్ర మాజీమంత్రి శివశంకర్‌ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సంతాపం తెలిపారు. గవర్నర్‌, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. శివశంకర్‌ కుటుంబ సభ్యులకు గవర్నర్ సానుభూతి తెలిపారు. అలాగే శివశంకర్‌ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో పాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కేవీపీ రామచంద్రరావు, వీహెచ్‌, షబ్బీర్‌ అలీ తదితరులు నివాళులర్పించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.