ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు

gadchiroli court convicts du professor g saibaba for Maoists links sentenced to life imprisonment

gadchiroli court convicts du professor g saibaba for Maoists links sentenced to life imprisonment

దిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం అవి నిర్థారణ కావడంతో దోషిగా ప్రకటించింది. ప్రొఫెసర్‌ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది.

దిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యం పాలుకావటంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది.

అదే విధంగా సాయిబాబాతో పాటు మహేష్‌ తిక్రి, పాండు నరోటీ, విజయ్‌ టిక్రి, జేఎన్‌యూ విద్యార్థులు హేమ్‌ మిశ్రా,  మాజీ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ రాహితో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.