జీఎస్టీకి వ్యతిరేకంగా బట్టల వ్యాపారుల నిరసన

Garment Shops closed and owners started protest against GST

జీఎస్టీ వల్ల తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశారని ఆరోపిస్తూ వస్త్ర వ్యాపారులు పోరుబాటపట్టారు. దీంతో వస్త్ర తయారీ పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి. వస్త్ర పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని నిరసిస్తూ వ్యాపారులు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు.

Garment Shops closed and owners started protest against GST

ఇన్నేళ్ళు టెక్స్‌టైల్స్‌ను ప్రత్యేక ప్రాధాన్యంగల అత్యవసర సరుకుగా పరిగణించారు. ఇప్పుడు జీఎస్టీ కింద పన్ను విధిస్తే పరిశ్రమ వెన్నువిరుగుతుంది అని టెక్స్‌టైల్స్ ట్రేడర్స్ అసోసియేషన్ (టీటీఏ) చెబుతోంది. ఇంతకాలం ఎటువంటి పన్ను చెల్లింపులేని చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రస్తుతం ఐదు శాతం పన్ను విధించారు. దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధినిస్తున్న టెక్స్‌టైల్ రంగంపై జీఎస్టీని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక నిర‌స‌న‌లు చేపడుతామని హెచ్చరించింది.

See Also: జీఎస్టీతో రైతన్నలపై మరింత భారం

వ్యాపారులతో పాటు వినియోగదారులపై అదనపు భారాన్ని మోపే జీఎస్టీని టెక్స్‌టైల్స్ రంగానికి మినహాయించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ హెచ్చరించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.