ఎంగురి డ్యామ్‌లో `పిఎస్‌వి గ‌రుడువేగ 126.18ఎం` షూటింగ్‌

Garudavega 7 Days shoot in a war zone on the largest Dam in Georgia

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” .

Garudavega 7 Days shoot in a war zone on the largest Dam in Georgia

ప్ర‌స్తుతం జార్జియాలో ఎంగురి డ్యామ్‌లో ఇప్పుడు గ‌రుడ వేగ టీం సంద‌డి చేస్తుంది. జార్జియా దేశానికి మూడొంతులు పైగా ఎల‌క్ట్రిసిటీ, తాగునీటిని స‌రఫ‌రా చేసే డ్యామ్ ఇది. జార్జియా ప‌శ్చిమాన ఉన్న ఈ డ్యామ్ ప్ర‌పంచంలోనే 6వ ఎత్తైన (271.5 మీ లేదా 891 అడుగులు) డ్యామ్. ఈ ప్రాంతంలో ఏడు రోజుల పాటు యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు.

పారాచ్యూట్స్‌, మిల‌ట‌రీ విమానాలు, ఎం-16 మెషీన్స్ స‌హా భారీగా పేలుడు ప‌దార్థాల‌ను ఉప‌యోగిస్తున్నారు. జార్జియా అధికారులు, డ్యామ్ అధికారులు యూనిట్‌కు స‌హకారం అందిస్తున్నారు. డ్యామ్ చీఫ్ ఇన్‌చార్జి జాన్ ఛ‌నియా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తుండ‌టం విశేషం. అంతే కాకుండా 4 డిగ్రీల చ‌లిలో ముప్పై మైళ్ళ వేగంతో గాలులు వీస్తుంది. ఈ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా యూనిట్ స‌భ్యులు ఎంతో క‌ష్ట న‌ష్టాల‌కోర్చి సినిమా షూటింగ్ చేస్తున్నారు.

See Also: బయటికొస్తున్న కొత్త కోణాలు

రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో న‌టిస్తుంది. జార్జ్ అనే క‌రుగుగ‌ట్టిన విల‌న్ పాత్ర‌లో కిషోర్ స‌హా నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

See Also: జులై 14న రానున్న’శమంతకమణి’

Have something to add? Share it in the comments

Your email address will not be published.