ఉద్యోగాల పేరుతో భారీ మోసం

హైదరాబాద్: నగరంలో ఉద్యోగాల పేరిట భారీ మోసం బయటపడింది. గేట్ మై జాబ్స్ డాట్ కామ్, అద్వితీయ శ్రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆదివారం ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కూడా వారికి తెలిపారు. నిరుద్యోగుల నుంచి రూ 200 ల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు ను ఆన్ లైన్ లో వసూలు చేశారు. దీంతో సుమారు 5 వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఆదివారం ఉదయం నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. తీరా అక్కడ వెళ్లిన నిరుద్యోగులకు ఇదంతా అబద్దమని తేలడంతో, వారంతా ఆగ్రహం చెంది కళాశాలలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.