చేపమందుకు రెడీనా..!

Get ready for free Asthma cure Medicine with Fish on June 8th and 9th in Hyderabad

Get ready for free Asthma cure Medicine with Fish on June 8th and 9th in Hyderabad

శ్వాస సంబంధిత రోగాలైన ఆస్థమా , దగ్గు, ఉబ్బసం,దమ్మువంటి దీర్గకాలిక రోగాల విరుగుడుకు బత్తిని కుటుంబం గత రెండు శతాబ్దాలుగా వంశపారంపర్యంగా మృగశిరా కార్తీ రోజున ఇచ్చే, ఔషధగుణాలు కల్గిన చేప ప్రసాదం వచ్చేనెల జూన్ 8వ తేదీ గురువారం ఉదయం 9 గంటలనుండి శుక్రవారం 9 వ తేది ఉదయం 9.గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఇవ్వనున్నట్లు ప్రకటించారు .

బత్తిని హరినాథ గౌడ్ మాట్లాడుతూ ‘1845 లో ఓ మునీశ్వరుడు తమ పూర్వీకులకు ఆస్థమా మరియు ఇతర శ్వాస సంబంధిత రోగాల నివారణకు ఔషధగుణాలుకలిగిన ప్రసాదాన్ని తయారుచేసే రహస్యం భోదించారని, అది ప్రతి సంవత్సరవం మృగశిర కార్తీ రోజున మాత్రమే రోగులకు ఇవ్వాలని, అది కేవలన మా కుటుంబ సభ్యులే ఇవ్వాలని, అదీ పూర్తిగా ఉచితంగానే ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలని ఆదేశించారని అన్నారు. ఈ ప్రసాదాన్ని ఎండాకాలం వెళ్ళాక తొలకరి జల్లులు పడి వాతావరణం కొంత చల్లబడినాక, మృగశిర కార్తీ ముందు రోజున ,తగిన నిష్ఠతో, పవిత్రంగా దైవ పూజ చేసి ఔషధగుణాలు కలిగిన ప్రసాదాన్ని తయారుచేసి చిన్న చేపపిల్ల నోటి లో ఈ ప్రసాదాన్ని ఉంచి, దాన్ని రోగి చేత మ్రింగిస్తామని . ఇలా వరుసగా 3 నుండి 4 సంవత్సరాల పాటు రోగి ఈ ప్రసాదాన్ని క్రమంగా తప్పకుండా స్వీకరించాలని, దానికి మేము సూచించిన ఆహారాన్నే తీసుకుంటూ ఉంటె ఆస్థమా మరియు ఇతర శ్వాస సంబంధిత రోగాలు నయమవుతాయని అదే గత 175 సంవత్సరాలుగా జరుగుతోందని అన్నారు. మన తెలుగు రాష్ట్రాలనుండే కాకుండా దేశ , విదేశాలనుండి కూడా వేల సంఖ్యలో పసి పిల్లల నుండి వృద్దులు వరకు వస్తున్నారని, ఒక రోగికి తగ్గితే తాను ఇతరులకు చెప్పి తీసుకొస్తున్నారని హరినాథ  గౌడ్ తెలియచేశారు.

శాఖాహారులకు బెల్లంతో కలిపి ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందని , వీరంతా తప్పకుండ పత్యం పాటించాలని కావున వచ్చే జూన్ నెలలో 8 మరియు 9 వతేదీలలో తాము ఇచ్చే ఈ మృగశిర కార్తీ చేప ప్రసాదాన్ని తీసుకునే వారు 7వ తేదీకల్లా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి రావాలని, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వయంగా సంబంధిత జిల్ల్లా కలెక్టర్, మత్స్య శాఖ ,జి.హెచ్ ఎం.సి , మెట్రో వాటర్ వర్క్స్, పోలీస్ శాఖ ,హెల్త్ , మునిసిపల్, విద్యుత్తు రవాణా శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి ముందుగానే కావాల్సినన్ని చేపపిల్లలను సిద్ధం చేయాలనీ, ఏ ఒక్కరికి అసౌకర్యం కలుగకుండా ,తొక్కిసలాట జరుగకుండా చూడాలని ఉచిత భోజనాలు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనీ , ఎప్పటికప్పుడు పారిశుధ్యం చేపట్టాలని , అన్ని ఏర్పాట్లను చేయాలనీ ఆదేశించారని హరినాథ్ వివరించారు .

Have something to add? Share it in the comments

Your email address will not be published.