ఏపి పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

Girls scores top among AP SSC class 10th results 2017

Girls scores top among AP SSC class 10th results 2017

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పదో తరగతి ఫలితాలను విశాఖపట్టణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మార్చి నెలలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 6 లక్షల 22వేల 538 మంది విద్యార్థులు హాజరవ్వగా అందులో 5 లక్షల 60వేల 253 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణతాశాతం 2.6 తగ్గి మొత్తం  91.92 శాతం  నమోదైంది.

ఈ యేడాది ఫలితాల్లో బాలురు 91.87 శాతం, బాలికలు 91.97 శాతం ఉత్తీర్ణతతో బాలురి కంటే ఎక్కువ ఉత్తీర్ణతాశాతం నమోదు చేశారు.
ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో రాష్ట్రంలో 11,143 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా 4,102 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి.  అంతేగాక సున్నాశాతం ఉత్తీర్ణత సాధించిన రెండు పాఠశాలలూ ప్రైవేటు పాఠశాలలే కావడం గమనార్హం.

జిల్లాల పరంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లా 97.97 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలవగా.. చిత్తూరు 80.55 శాతం ఉత్తీర్ణతతో ఆఖరిస్థానంలో నిలిచింది.  ఈ ఏడాది 18,227 మంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించారు. జూన్ 14 నుంచి 25 వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ారు. ఈ నెల 20లోగా పున‌ర్‌మూల్యంక‌నం కోసం వెయ్యి రూపాయల చ‌లానాతో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని  గంటా శ్రీనివాస్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.