బాలికలదే జోరు

Girls tops in SSC results in Telangana state as the pass percentage drops down

Girls tops in SSC results in Telangana state as the pass percentage drops down

ఎప్పటిలాగే ఈ యేడాది కూడా తెలంగాణా పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిలు తమ హవా కొనసాగించారు. బాలికలు 85.37 శాతం మంది పాసవగా బాలురు 82.95 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో పదవ తరగతి ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సచివాలయంలోని డి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాలులో  విడుదల చేశారు. టెన్త్‌ ఫలితాలలో జగిత్యాల జిల్లా 97.35 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, వనపర్తి జిల్లా 64.84 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. అలాగే 2005 స్కూళ్లలో వందశాతం ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం వల్లే ఈ సారి ఉత్తీర్ణత తగ్గిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. అంతేగాక జూన్‌ 5వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు అధికారులు. ఈ యేడాది పదో తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించగా ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియం నుంచి 48 శాతం మంది, ఇంగ్లీష్‌ మీడియం నుంచి 52 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. 20 ప్రైవేట్, 5 ఎయిడెడ్, 3 ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.