ప్రేమతో మీ కార్తీక్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన

Good response to Prematho mee karthik first look

Good response to Prematho mee karthik first look

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రేమతో మీ కార్తీక్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. ప్రేమతో మీ కార్తీక్ చిత్రాన్ని దర్శకుడు రిషి అందమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. కెరీర్, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు. ఈ చిత్రంతో మంచి దర్శకుల లిస్టులో రిషి చేరతాడని భావిస్తున్నాం.  భలే భలే మగాడివోయ్ తర్వాత మురళీ శర్మ అంత అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చేశారు. గొల్లపూడి మారుతి రావు గారు చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. కేరళ లోని వాగమన్, ఇడుక్కి ప్రాంతాల్లో కూర్ల్ లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్ చేయని అందమైన లొకే,న్స్ లో షూట్ చేయడం జరిగింది. మలయాళంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ అందించిన పాటలు హైలైట్ గా నిలుస్తాయి. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ మరో హైలైట్ గా ఉంటుంది. కేరళ, కూర్గ్, గోవా, హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు – కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు.
సాంకేతిక నిపుణులు

సంగీతం – షాన్ రెహమాన్ , సినిమాటోగ్రఫి- సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు ,  ఎడిటర్- మధు , ఆర్ట్- హరి వర్మ,  మేకప్- నాగు తాడల , కాస్ట్యూమ్స్- నాగు, రమణ శ్రీ ఆర్ట్స్ , సమర్పణ-గీతా మన్నం,  లైన్ప్రొడ్యూసర్ – అశోక్ రెడ్డి గుమ్మకొండ, నిర్మాతలు-  రమణ శ్రీ గుమ్మ కొండ, రవీందర్ గుమ్మకొండ, రచన దర్శకత్వం – రిషి

Have something to add? Share it in the comments

Your email address will not be published.