నగదు లావాదేవీలు చేస్తున్నారా… అయితే ఇక మీకు మూడినట్లే..!

Government moves a fresh proposal to limit cash transactions at 2Lakhs

 

Government moves a fresh proposal to limit cash transactions at 2Lakhs

నగదు రహిత సమాజం అంటూ కేంద్రం ఎన్ని నిబంధనలు తెచ్చినా మీరు మాత్రం హాయిగా నగదు లావాదేవీలు చేసేస్తున్నాారా??? మమ్మల్ని ఇప్పటి వరకూ ఎవరూ పట్టుకోలేదు కదా మాకేం కాదులే అనుకుంటున్నారా??? అయితే మీ ఆలోచనలను కాస్త గ్యాప్ ఇచ్చి లక్షల్లో చేస్తూ నగదు లావాదేవీలను కాస్త ఆపేయండి. లేకపోతే మీకు ఇక తలరాత మారడానికి రెడీగా ఉందని గుర్తుంచుకోండి.

మనదేశంలో ఆర్థికరంగానికి సంబంధించి రోజుకో కొత్త నిబంధనని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే నవంబర్ 8 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయి నగదు రహిత లావవాదేవాలు చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన కొత్త నియమాలను ప్రజలు స్వాగతించి సర్దుకుపోవడం మొదలుపెట్టారు. అయితే బడ్జెట్‌లో నగదు లావాదేవీలపై తమ నిర్ణయాన్ని వెలిబుచ్చిన ప్రభుత్వం తాజాగా నగదు లావాదేవీలపై షాకిచ్చింది.

బడ్జెట్‌లో ఇచ్చిన 3 లక్షల రూపాయల వరకు నగదు లావాదేవీల పరిమితిని 2 లక్షల రూపాయలకు కుదించింది. నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఈ నగదు లావాదేవీలను 2 లక్షల రూపాయలకు పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫైనాన్స్‌ బిల్లు 2017కు సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా 2 లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే భారీగా జరిమానా విధించే దిశగా కేంద్రం ఈ బిల్లుకు మార్పులు చేస్తోంది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ఆర్థికపరమైన అంశాల్లో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నగదు లావాదేవీలను కంట్రోల్ చెయ్యడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరో కీలక నిర్ణయం. దీని వల్ల నగదు రూపంలో 2 లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరిపే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా  రెండు లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే అంత మొత్తం జరిమానా కట్టవలసి ఉంటుంది.

ప్రస్తుతం ఈ బిల్లు విషయమై లోకసభలో చర్చ జరుగుతోంది. నగదు లావాదేవీలను 3 లక్షల రూపాయలకు పరిమితం చేస్తున్నామని మార్చి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్రాతుందని అరుణ్గా జైట్లీ ప్రకటించారు. అయితే కేంద్రం తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయం వల్ల నగదు లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశఆలున్నాయి. ఇప్పటికే గత నెల రోజులుగా బ్యాంకుల్లోనూ, ఎటిఎంల్లోనూ ఎక్కడా డబ్బులులేక నో క్యాష్ బోర్డులు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఇప్పుడు ఈ కొత్త నిబబంధన సైతం నగదు రహిత సమాజం వైపు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.