మాది సంక్షేమ ప్రగతిశీల ప్రభుత్వం: గవర్నర్

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ది పధంలో దూసుకుపోతున్నది గవర్నర్ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ప్రతి పౌరునికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం 33 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం చేయడంతోపాటు 17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసినట్టు గవర్నర్ పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు గతంలోకంటే ఎక్కువ మొత్తంలో మెరుగ్గా పింఛన్లను చెల్లిస్తున్నామని తెలిపారు. ఎక్కడాలేని విధంగా తొలిసారి బీడీ కార్మికులు, ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు వెయ్యి చొప్పున పింఛన్లు చెల్లిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి దిశగా వేగవంతంగా అడుగులు వేస్తున్నదని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సభకు తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరాతోపాటు, మిషన్ భగీరధ తదితర కార్యక్రమాలను ప్రశంసించారు. మిషన్ కాకతీయ, విషన్ భగీరధ పధకాలు దేశంలోనే ఎన్నో రాష్ట్రాలను ఆకర్షించాయన్నారు. అదే విధంగా కొత్త జిల్లాలు, పోలీస్ కమీషనరేట్ల ఏర్పాటు చర్యలను ఆయన అభినందించారు. సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్న తమ ప్రభుత్వం, రాష్ట్రంలో చివరి వ్యక్తి వరకు ఫలాలు అందేలా పనిచేస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. నూతన రాష్ట్రమైనా జీఎస్ టీపి దేశ సగటును మించిపోయిందని తెలిపారు.

సులభతర వాణిజ్యం ప్రవేశపెట్టిన ప్రభుత్వం పారిశ్రామిగ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటుందని గవర్నర్ తెలిపారు. పారిశ్రామిక అనుమతుల వల్ల 54 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. ఐటి ఎగుమతుల్లో రాష్ట్ర రాజధాని రెండో స్థానంలో ఉందని గవర్నర్ వెల్లడించారు.  అదే విధంగా రాష్ట్రంలో టీ హబ్ ఏర్పాటు, డేటా ఎనలిటిక్, గేమింగ్ యానిమేషన్ రంగాల్లో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. విద్యుత్ ఉత్పతికి తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు లోటు లేకుండా నిరంతరం విధ్యుత్  సరఫరా జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో సేవా రంగానిది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నదని గవర్నర్ పేర్కొన్నారు. రహదారుల విస్తరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అవినీతికి తావు లేకుండా 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ స్పష్టం చేశారు.

సంక్షేమ రంగంలోనూ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్న గవర్నర్ వృద్దులు, వితంతువులు, వికలాంగులకు గతంలో కంటే మెరుగ్గా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పింఛను, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల జీవనృతి ఇస్తున్నామని సభకు తెలిపారు.

సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరాతోపాటు పేద ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని వివరించారు. విదేశాల్లో చదువుకునే పెద పిల్లలకు 20 లక్షలు, అమర వీరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్తో పాటు వీఆర్ ఏలు, అంగన్ వాడీ వేతనాలను పెంచామన్నారు.

నూతన రాష్ట్రంలో 27,481 ఉద్యోగాలు కల్పించామన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందన్న నరసింహన్ రైతులను 17 వేల కోట్ల రుణ విముక్తలను చేశామని తెలిపారు. 23 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని వివరించారు.

స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలన్న సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరద ఫలితాలు ఈ ఏడాది చివరి నాటికి సాకరమవుతుందన్నారు.

ఈ సభలో జరిగే చర్చలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు చేసిన త్యాగాలను ప్రతిబింబించేలా ఉంటాయని ఆవిస్తున్నాను. సభలో చర్చలు మంచి వాతావరణంలో స్పూర్తి దాయకంగా ఉండేలా సభ నిర్వహణకు సభ్యులందరూ సహకించాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని కోరుతున్నారు.

గ్రామాభివృద్ధితోనే అభివృద్ధి సాధ్యమన్న గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావించిన గవర్నర్ అత్యంత వెనుకబడిన కులాల అభ్యున్నతికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. 27 కోట్ల రూపాయలు వెచ్చించి చేపల పెంపకం చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోనే ప్రధాన దేవాలయాలైన యాదాద్రి, వేములవాడ, భ్రదాచలం, జోగులాంబ పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, శాసనమండలి అధ్యక్షుడు, శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు అందరికీ అభినందనలు చెప్పారు. 2017-18 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.