నక్సల్స్‌ దాడి పాశవిక హత్య అంటున్న హోంమంత్రి

Govt will review anti-Naxal strategy and It's a cold-blooded murder says Rajnath Singh after he pays homage to CRPF men in Chattisghar

 Govt will review anti-Naxal strategy and It's a cold-blooded murder says Rajnath Singh after he pays homage to CRPF men in Chattisghar

 

ఛత్తీస్‌గఢ్‌లోని సుకమా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడి పాశవిక హత్య అన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. నిన్న మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు రాజ్‌నాథ్‌ నివాళులర్పించారు. ఢిల్లీ నుండి ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్న కేంద్ర మంత్రి, క్యాంప్‌లో ఉన్న జవాన్ల మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

మావోల దాడిపై విచారం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్  మావోయిస్టులు నిరాశలో చేసిన క్రూరమైన హత్యగా అభివర్ణించారు. అంతేగాక నక్సలైట్లకు వ్యతిరేకంగా వ్యూహాలపై సమీక్ష నిర్వహిస్తున్నామని స్పష్టంచేశారు. మావోయిస్టులు గిరిజనులను పావులుగా వాడుకొని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్న రాజ్‌నాథ్ అభివృద్ధిని అస్థిరపరచడమే మావోల లక్ష్యమని చెప్పారు.

అక్కడి నుంచి రామకృష్ణ కేర్‌ ఆసుపత్రికి వెళ్లి మెరుపుదాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.