సాహో శాతకర్ణి…

Gowthamiputra Shatakarni Completes 50days

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని తెలిపిన సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. బాలయ్య కెరీర్‌లో శాతకర్ణికంటే ముందు బిగ్గెస్ట్ హిట్ అయిన లెజెండ్ సినిమా శాటిలైట్ రైట్స్‌ అన్నీ కలుపుకొని 50కోట్ల వరకు వసూలు చేసింది. అలాంటి సినిమాకి తలదన్నేలా 70కోట్ల బడ్జెట్‌తో గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ క్రిష్ ధైర్యం చేసి సినిమా తెరకెక్కించారు. అయితే కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందో లేదో అనుకొనే సమయంలో సంక్రాంతి సమయంలో సాహో శాతకర్ణి అంటూ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడమేకాకుండా  కలెక్షన్ల విషయంలోనూ దూసుకెళ్ళింది. సినిమా విడుదలై 50రోజులు పూర్తి చేసుకొనే సమయానికి  థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ రైట్స్, శాటిలైట్, ఆడియో, డీవీడీ, డిజిటల్ అన్ని హక్కులన్నీ కలిపితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 77 కోట్ల రూపాయలు వసూలు చేసిందని నిర్మాతలు అంచనాకు వచ్చారు.
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని 70కోట్ల బడ్జెట్‌లో తీయాలని మొదట్లో అనుకున్నప్పటికీ ఖర్చు మాత్రం సుమారు 55కోట్ల అయ్యిందని టాక్. దీంతో ఈ సినిమా నిర్మాతలకు 20కోట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడంతో నిర్మాతలకు బాగా కలిసొచ్చిన మరో అంశమైంది. మొత్తానికి బాలయ్య 100వ సినిమా కలెక్షన్లలోనూ క్రేజీగా దూసుకెళ్తోంది.

Gowthamiputra Shatakarni Completes 50days

Have something to add? Share it in the comments

Your email address will not be published.