నింగికెగిసిన జీశాట్-9

gsat-9-launch-indias-south-asia-satellite-takes-off-from-sriharikota

gsat-9-launch-indias-south-asia-satellite-takes-off-from-sriharikota

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌‌లోని రెండో లాంచిగ్ ప్యాడ్ నుంచి శుక్రవారం సాయంత్రం 4గంటల57 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చడంతో దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. ఈ రాకెట్‌ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన జీశాట్‌–9 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12గంటల 57 నిమిషాల నుండి ఈరోజు 04గంటల57 నిమిషాల వరకు కౌంట్‌డౌన్‌ జరిగింది. అయితే ఈ ప్రయోగాన్ని 20మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ షార్‌ నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడంతో పాటు ఇప్పటివరకు నిర్వహిం చిన 10 ప్రయోగాల్లో 3 ఫెయిల్ అవ్వగా 7  ప్రయోగాలు విజయవంతమయ్యాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.