జీఎస్టీ ఎఫెక్ట్: సోమవారం నుండి సినిమా థియేటర్లు బంద్

GST Effect: Movie Theatres will remain closed from Monday

ఒక దేశం  – ఒక పన్ను – ఒక జీఎస్టీ అంటూ నిన్న అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చేసిన ఏకీకృత పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ జనాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీలో కొన్ని సేవలపై భారం అధికంగా ఉందని, దానివల్ల తమకు నష్టం కలుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో సినిమా థియేటర్ల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

GST Effect: Movie Theatres will remain closed from Monday

ముఖ్యంగా జీఎస్టీ అమలుపై మొదటి నుండి వ్యతిరేకిస్తున్న తమిళనాడు థియేటర్ల సంఘం కఠిన నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుండి రాష్ట్రంలోని అన్ని థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. సినిమారంగంపై 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమా టిక్కెట్ల ధరలు 150 రూపాయలకి పైగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.

See Also: జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోలు 40/- రూపాయల్లోపే

మరోవైపు జీఎస్‌టీకి అదనంగా 30 శాతం మునిసిపల్ ట్యాక్స్‌ విధించేందుకు తమిళనాడు స్థానిక సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పుండు మీద కారం చల్లినట్లు జీఎస్టీ దెబ్బతో విలవిలలాడుతున్న థియేటర్ల యజమానులపై భారం పడనుంది. దీంతో థియేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ జీఎస్‌టీతోపాటు అదనంగా 30 శాతం మునిసిపల్ పన్నును విధిస్తున్నారని, దీంతో మొత్తం పన్ను 60 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఈ భారాన్ని భరించలేమని, అందుకే సోమవారం నుంచి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించామని స్పష్టంచేశారు.

See Also: శమంతకమణి వేటలో బాలయ్య

మొత్తానికి జీఎస్టీ వచ్చినప్పటినుండే కొత్త రకమైన సమస్యలు మొదలయ్యాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.