బంగారంపై జీఎస్టీ ఖరారు – జూలై 1 నుండి అమలు

gst-fixes-rates-gold-to-be-taxed-at-3-percent-beedis-at-28-percent-and-states-agree-to-1-july-roll-out

gst-fixes-rates-gold-to-be-taxed-at-3-percent-beedis-at-28-percent-and-states-agree-to-1-july-roll-out

అంతా సిద్ధమౌతోంది. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్‌టీకి లైన్‌ క్లియర్‌ అయింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌లో15 వ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్  జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ట్రాన్సిషన్‌ అండ్‌ రిటర్న్‌ సహా పెండింగ్‌ లో ఉన్న ఇతర అన్ని అంశాలపై ఏకాభిప్రాయం  కుదిరింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు హాజరైన సమావేశంలో మిగిలిన వస్తువులకు సంబంధివంచి జీఎస్టీని ఖరారు చేశారు. దీంతో  జులై 1 నుంచి ఒకే దేశం ఒకే పన్ను (జీఎస్‌టీ) అమలుకు ఆమోదం లభించింది.

జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమలులోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గత నెలలో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500 వరకూ సేవలకు నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతం చొప్పున రేట్లు నిర్ణయించిన కౌన్సిల్‌ ఈ రోజు పసిడి, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు తదితర అంశాలకు సంబంధించి రేట్లను ఖరారు చేసింది. ఈరోజు ఖరారు అయిన వస్తువుల్లో ఖరీదైన చెప్పులు, రెడీమెడ్‌ దుస్తులపై జీఎస్టీ మోత మోగించనుంది.

బంగారంపై 3శాతం పన్ను విధించాలని, రెడీమేడ్‌ దుస్తులపై 12శాతం, నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం, 500 రూపాయలలోపు ఉన్న పాదరక్షలపై 5శాతం, 500 రూపాయలు దాటిన పాదరక్షలపై 18శాతం చొప్పున పన్ను విధించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. అలాగే రెడీమెడ్‌ దుస్తులపై జీఎస్టీ మోత మోగనుంది. నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం పన్ను విధించనుండగా, రెడీమెడ్‌ దుస్తులపై 12శాతం పన్ను విధించాలని నిర్ణయించారు.

మరోవైపు తినే బిస్కెట్లపై ఏకంగా 18శాతం​ పన్ను విధించగా, సామాన్యులు తాగే బీడీలపై 28శాతం పన్నుతో మోత మోగించారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.