జీఎస్టీ లాంచ్- దూరంగా ఉండాలని నిర్ణయించిన కాంగ్రెస్

GST Launch Congress Party decides it will not attend

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జూలై 1తేదీ నుండి ప్రవేశపెడ్తున్న జీఎస్టీ లాంచింగ్ కోసం జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. దేశంలో అతి పెద్ద ప‌న్ను సంస్క‌ర‌ణ‌గా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశానికి కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది..

GST Launch Congress Party decides it will not attend

జీఎస్టీ అధికారిక ప్రారంభానికి ముందు నిన్న రాత్రి పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో రిహార్స‌ల్స్ నిర్వ‌హించారు. మరోవైపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖర్జీ హాజ‌రయ్యే ఈ ప్ర‌త్యేక స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ జీఎస్టీని ప్రారంభించ‌డం రాష్ట్రపతి హోదాను త‌గ్గించ‌డ‌మే అవుతుంద‌ని కాంగ్రెస్ అభిప్రాయ‌ప‌డుతోంది. రాష్ట్ర‌ప‌తి స‌మ‌క్షంలో ప్ర‌ధాని ఎలా ప్రారంభిస్తారు? ఇది ఆమోద‌యోగ్యం కాదు అని నిర్ణయించారు. దీనికి సంబంధించి సోనియా, మ‌న్మోహ‌న్‌ల‌తోపాటు ఇత‌ర కాంగ్రెస్‌ నేత‌లు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించ‌డంతోపాటు ఇత‌ర పార్టీల‌ నేత‌ల‌తోనూ మాట్లాడి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

See Also: జీఎస్టీతో రైతన్నలపై మరింత భారం

మరోవైపు అటు బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెనర్జీ కూడా జీఎస్టీని తీవ్రంగా వ్య‌తిరేకించి ఆ బిల్లును త‌మ అసెంబ్లీలో ఆమోదించ‌లేదు. దీంతో రేపు రాత్రి జరుగబోయే కార్య‌క్ర‌మానికి తృణ‌మూల్ కాంగ్రెస్ కూడా దూరంగా ఉండ‌నుంది. అయితే ఎన్సీపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు కూడా ప్రత్యేక సమావేశానికి హాజరు అవ్వాలా వద్దా అనే అంశంపై ఈరోజు రాత్రికల్లా తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

See Also: మీడియాపై కెటిఆర్ గరం – తెలంగాణా ఇమేజ్‌ను దెబ్బతీయకండి

Have something to add? Share it in the comments

Your email address will not be published.