ప్రజల్లో భయాందోళనలు కలిగించొద్దు: ఈటెల

GST Launch Finance Minister Etela Rajender Conducts a Review meeting with Officials

జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమలుకాబోతున్న జీఎస్టీకి సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తెలంగాణా ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్. ప్రస్తుతం పన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని, ఇప్పటివరకు దేశంలో ఎన్నో రకాల పన్నులున్నాయని చెప్పుకొచ్చారు.

GST Launch Finance Minister Etela Rajender Conducts a Review meeting with Officials

ఎల్లుండి నుండి అమలులోకి రాబోతున్న జీఎస్టీ సన్నద్ధతపై మంత్రి ఈటెల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీఎస్టీతో రాష్ట్రప్రభుత్వం, సామాన్యులపై భారం ఉండొద్దని కేంద్రాన్ని కోరగా..కేంద్రం కొన్నింటిని ఒప్పుకుని, మరికొన్నింటిని తోసిపుచ్చిందన్నారు ఈటెల. ట్రేడర్స్ ప్రజల్లో భయాందోళనలు కలిగించొద్దని, చేనేత, గ్రానైట్, బీడీ పరిశ్రమపై పన్ను వద్దని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. అంతేగాక రాష్ట్రంలో వసూలయ్యే పన్ను రాబడిలో కేంద్రానికి 50 శాతం వెళ్తుందని, సామాన్యులు వాడే ఆహార పదార్థాలపై పన్నులు తక్కువ ఉంటాయన్నారు. జీఎస్టీలో లోపాలను ఎప్పటికపుడు గుర్తిస్తూ ప్రతికూలతలను తొలగిస్తామన్నారు.

See Also: సంగారెడ్డిలో జీఎస్టీ రగడ

జీఎస్టీలో ఇప్పటికే 82 శాతం వ్యాపారులు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 7వేల మంది ట్రేడర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 1.70 లక్షల మంది ట్రేడర్స్ నమోదు చేసుకున్నారు. కొత్తగా 25 వేల మంది ట్రేడర్స్ నమోదు చేసుకునే అవకాశముందన్నారు. జీఎస్టీ నమోదుకు జులై 5 వరకు అవకాశముంది. 14 శాతంలోపు వృద్ధిరేటు ఉన్న రాష్ర్టాలకే జీఎస్టీ నష్టాన్ని భర్తీ చేస్తారు. తెలంగాణ వృద్ధి రేటు 17.9 శాతం ఉన్నందున నష్టాన్ని భర్తీ చేయరన్నారు. అంతేగాక 6 అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినట్లు ఈటెల తెలిపారు.

See Also: జీఎస్టీ లాంచ్- దూరంగా ఉండాలని నిర్ణయించిన కాంగ్రెస్

Have something to add? Share it in the comments

Your email address will not be published.